వాణీ విశ్వనాధ్ వారసురాలు వచ్చేస్తోంది.

varsha vishwanath

ఫిల్మ్ డెస్క్- సినిమా పరిశ్రమలో ముందు నుంచి వారసులదే హవా అని చెప్పవచ్చు. అప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారు, క్రమ క్రమంగా వారి వారసులను తీసుకువస్తున్నారు. ఇది తరతరాల నుంచి జరుగుతూ వస్తున్నదే. ఐతే దక్షిణాది సినీ పరిశ్రమలో వారసులు ఎక్కువగా అబ్బాయిలే ఉంటున్నారు. అమ్మాయిలను ఈ ఫీల్డ్ లోకి తెచ్చేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. ఇక అలనాటి కధానాయిక వాణీ విశఅవనాధ్ తెలుసు కదా. తెలుగుతో పాటు తమిళ, కన్నడ బాషల్లో చాలా సినిమాల్లోనే నటించింది. వాణీ విశ్వనాధ్ కూతరు వర్షా విశ్వనాథ్‌. ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది వర్షా. వాణీ విశ్వనాథ్‌కు నట వారసురాలిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెడుతోంది వర్ష.

varsha vishwanath actress

కేరళలోని త్రిస్సూర్‌లో ఇంటర్‌ పూర్తి చేసిన వర్షా విశ్వనాథ్‌ తమిళంలో మూడు సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు రెడ్డిగారింట్లో రౌడీయిజం మూవీతో తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతోంది. రమణ్‌ కథానాయకుడిగా, శిరీషారెడ్డి నిర్మిస్తున్న సినిమా కు ఎం.రమేశ్‌, గోపీ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వర్ష అచ్చతెలుగు అమ్మాయిగా కనిపించనుందట. ఒక సినిమా సెట్‌ మీద ఉండగానే మరో రెండు చిత్రాలకు సంతకం చేసింది వర్ష. సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరితో ఓ సినిమా చేయడానికి వర్షా విశ్వనాథ్‌ రెడీ అవుతోంది. మరి తెలుగు ప్రేక్షకులు ఏ మేరకు వర్షను ఆదరిస్తారో చూడాలి.