బాలయ్యకు గుడ్ బై చెప్పిన ప్రగ్య జైస్వాల్

ఫిల్మ్ డెస్క్- నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్నఅఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్ ఎస్ థమన్ సంగీతం ఈ సినిమాకి హైలెట్‌గా నిలవబోతోందన్ని ఇప్పటికే రిలీజైన ఫస్ట్ రోర్ అండ్ టైటిల్ రోర్‌తో అర్థమైపోయింది. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన తాజా షెడ్యూల్‌లో బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజా షెడ్యూల్‌కి ప్రగ్యా జైస్వాల్ ప్యాకప్ చెప్పినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కంచె స్థాయి హిట్ మళ్ళీ ఈ బ్యూటీకి దక్కలేదనే చెప్పాలి. అయితే బాలయ్య అఖండ సినిమాతో భారీ హిట్ అందుకుంటానన్న నమ్మకంతో ఉందట ప్రగ్యా జైస్వాల్. కేవలం 17 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది అఖండ. ఇవన్నీ ప్రగ్యాకి ప్లస్ అవుతాయని భావిస్తుందట. అంతే కాదు ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్‌ లో కూడా ఒక సినిమాలో నటిస్తోంది.