పవన్ కళ్యాణ్ కు, ఆయన నటనకు హ్యాట్సాఫ్ అంటున్న పెళ్లిచూపుల రీతూ

RItu VARMA

ఫిల్మ్ డెస్క్- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేస్తోంది. థియేటర్లో మిస్ అయిన అభిమానులతో పాటు, సెలెబ్రిటీలందరూ కూడా ఇంటి దగ్గరే ఈ సినిమాను చూస్తున్నారు. అంజలి, నివేదా ధామస్, ఐశ్వర్యా రాజేష్ ప్రకాష్ రాజ్.. ఇలా తారలంతా కూడా ఇంట్లోనే వకీల్ సాబ్‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నారట. తాజాగా పెళ్లిచూపులు ఫేమ్ రీతూ వర్మ కూడా వకీల్ సాబ్ సినిమాను చూసింది. సోషల్ మీడియా వేదికగా తన స్టైల్లో రివ్యూ ఇచ్చింది రీతూ వర్మ. పవన్ కళ్యాణ్‌కు, ఆయన నటనకు హ్యాట్సాఫ్ చెబుతూ రీతూ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ACTRESS RITU VARMA

వకీల్ సాబ్ మీద ప్రశంసిస్తూ చేస్తోన్న ట్వీట్ ఇది.. వద్దు అంటే వద్దు అనే సందేశాన్ని చాలా గట్టిగా వినిపించారు.. సత్యదేవ్ అనే పాత్రకు, పేరుకు న్యాయం చేసేలా లాయర్ ‌గా నటించేశారు.. సత్యం కోసం పోరాడారు.. హ్యాట్సాఫ్ టు పవన్ కళ్యాణ్ సర్.. అంటూ రీతూ వర్మ ప్రశంసల వర్షం కురిపించింది. ఇక సినిమాలోని ఇతర నటీనటుల మీదా ఆమె కామెంట్ చేసింది. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల అదరగొట్టేశారని.. తమన్ కొట్టిన మాస్ మ్యూజిక్ లేకపోతే అంతా అసంపూర్ణంగానే ఉండేది అంటూ అందరిని పొగిడేసింది.