అత్యంత ఖరీదైన కలప ఏది అంటే.. అంతా ఎర్రచందనం అనే సమాధానం చెప్తారు. ఇందుకే అడవుల్లో ఈనాటికీ ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా కొనసాగుతూ వస్తోంది. అంత ఎందుకు..? బుర్ర మీసాల వీరప్పన్ కూడా వీటిని కొల్లగొట్టే.. కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ.., మీకు తెలుసా? ఎర్రచందనంను మించిన కాస్ట్లీ కలప కూడా ఉంది. ఆ కలప వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గంధపు చెక్కను ఖరీదైనదే. ఇది కిలో రూ.8 వేల వరకు పలుకుతోంది. కానీ.., గంధపు చెక్క ధర కంటే చాలా రెట్లు ఎక్కువ అయిన కలప పేరు ఆఫ్రికన్ బ్లాక్ ఉడు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలప. దీని కిలో రేటు ఎంతో తెలుసా? 8 వేల పౌండ్స్. అంటే.., ఒక కిలో ఆఫ్రికన్ బ్లాక్ ఉడు కలప ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ.7 లక్షల. ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ చెట్లు ఎక్కడ పడితే అక్కడ పెరగవు. ఇవి ఆఫ్రికాలోని పొడి ప్రాంతాలలో సెనెగల్ తూర్పు నుండి ఎరిట్రియా దక్షిణాఫ్రికాలోని ఈశాన్య భాగాలలో మాత్రమే కనిపిస్తాయి. 25 నుండి 40 అడుగుల ఎత్తు పెరిగే ఈ చెట్లకి సువిశాల ప్రాంతం అవసరం ఉంటుంది. కలపకి ఉపయోగపడేలా ఒక ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ చెట్టు సిద్ధం కావాలంటే సుమారు 60 సంవత్సరాలు పైనే పడుతుంది. ప్రస్తుతం కెన్యా, టాంజానియా వంటి అతి తక్కువ దేశాల్లో మాత్రమే ఈ చెట్లు ఉన్నాయి. దీంతో.., ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ చెట్లు అంతరించిపోయే వాటి జాబితాలో చేరిపోయాయి. ఇక ఈ దేశాల్లో కూడా ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ చెట్లను కొట్టేసి.., కలపని ఇతర దేశాలు దాటించేస్తునారు స్మగ్లర్స్. మరి.. ఈ కలపకి ఎందుకు ఇంత డిమాండ్? వీటిన ఎందులో వాడుతారో ఇప్పుడు చూద్దాం. ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ చెట్ల కలపను ఎక్కువగా క్లారినెట్, వేణువు, గిటార్ వంటి సంగీత వాయిద్యాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా, ఈ కలప నుండి బలమైన, మన్నికైన ఫర్నిచర్ కూడా తయారవుతుంది, కానీ అవి చాలా ఖరీదైనవి. వీటిని కొనడం సామాన్యుల వల్ల కాదు. ఆఫ్రికా దేశాల్లోని బడా కోటీశ్వరులు మాత్రమే ఈ కలపతో చేసిన ఫర్నీచర్ వాడుతారు. ఈ లెక్కన ఇలాంటి చెట్టు కనుక ఒక్కటి ఇంట్లో ఉన్నా చాలు. వారు కోటీశ్వరులు అయిపోయినట్టే . మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.