ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ పేటీఎం యూజర్లకు బ్యాడ్ న్యూస్. మొబైల్ రీఛార్జులపై పేటీఎం అదనపు ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. రీఛార్జి మొత్తాన్ని బట్టి రూ.1 నుంచి రూ.6 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పేటీఎం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయకపోయినప్పటికీ.. అందుకు సంబంధించి కొందరు వినియోగదారులు సోషల్ మీడియా ఖాతాల్లో స్క్రీన్ షాట్‌లను పోస్ట్ చేస్తున్నారు. ఫోన్ పే ఇప్పటికే.. రూ.50 పైబడి చేసే రీచార్జులపై సర్ చార్జీలను వసూలుచే స్తోంది. పేటీఎం ఇప్పుడు అదే బాటను అనుసరిస్తోంది. మొబైల్ రీచార్జ్ చేసినప్పుడు ప్లాన్ విలువను బట్టి రూ.1 నుంచి రూ.6 వరకు పేటీఎం అదనపు చార్జీలను వసూలు చేస్తోందని తెలుస్తోంది. కన్వినెన్స్ ఫీజ్, ప్లాట్‌ఫామ్ ఫీజ్ పేర్లతో దీన్ని వసూలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం కొంత మంది యూజర్లకే ఈ బాదుడు కార్యక్రమాన్ని పేటీఎం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చార్జీల వడ్డెనకు గురైన కొందరు యూజర్లు ఆ స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే మార్చి చివరి నుంచే కొద్ది మందికి అదనపు చార్జీలు పడగా.. ఇప్పుడు మరింత మందికి ఈ సర్వీసులు అమలులోకి తెచ్చిందని సమాచారం. అయితే ప్రస్తుతానికి రూ.100, ఆపై రీచార్జ్‌లపైనే పేటీఎం అదనపు చార్జీలను వసూలు చేస్తున్నట్లు స్క్రీన్ షాట్లను బట్టి తెలుస్తోంది. #paytmkaro @Paytmcare Increase charges everywhere need to change direction for another app pic.twitter.com/RyZjDiM6Fs — BAdri (@badrinadh01) June 12, 2022 @paytmbankcare @Paytmcare @PaytmMH What is this new type looting people by collecting xtra 1 ,2 ,3 rupees i m using #Paytm since 2016 never seen this type if charges earlier should i avoid using paytm or you will back to your old days.#paytmkaro pic.twitter.com/9A8eKAuzYL — Ismail Saleh (@mr04101997) June 10, 2022 ఇది కూడా చదవండి: RBI కీలక నిర్ణయం! ఇకపై క్రెడిట్ కార్డ్ ద్వారా UPI పేమెంట్స్..! పేటీఎం వ్యాలెట్, యూపీఐ, క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు.. ఇలా ఏ పేమెంట్ విధానం అయినా సర్ ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు పలువురు యూజర్లు ట్విటర్ లో పేర్కొంటున్నారు. ఈ సర్ ఛార్జ్ పేటీఎం అందరి యూజర్ల నుంచి తీసుకోవడం లేదని, కొంతమంది నుంచి మాత్రమే తీసుకుంటోందని తెలుస్తోంది. నష్టాల్లో ఉన్న పేటీఎం.. రెవెన్యూను పెంచుకోవడంలో భాగంగానే ఈ ఫీజు వసూలు చేస్తోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గూగుల్ పే, అమెజాన్ పే వంటి సంస్థలు మాత్రం ఇప్పటికైతే మొబైల్ రీచార్జులపై ఎలాంటి రుసుములూ వసూలు చేయడం లేదు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. The surcharge ranges between Re. 1 and Rs. 6 — depending on the recharge amount#paytmkaro pic.twitter.com/De0KLChXYW — Rangu Upender️ (@RupenderUP1) June 10, 2022