భారీగా పెరిగిన బంగారం ధరలు!

బంగారం.. భారతీయులు దీనిని కేవలం ఆర్ధిక పరమైన అంశంగా మాత్రమే చూడరు. బంగారాన్ని ఓ సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. దీనికి తోడు ఇప్పటి రోజుల్లో స్టాక్ మార్కెట్ కన్నా.., బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో ఇప్పుడు మళ్ళీ బంగారం ధరలకి రెక్కలొస్తున్నాయి. పోయిన ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి బంగారం ధర వరుసగా పతనం అవుతూనే వచ్చింది. కానీ.., ఏప్రిల్ ఒకటి నుండి గోల్డ్ రేటు పెరుగుతూ వస్తోంది. ఇంత క్రైసిస్ కాలంలోనే పెట్టుబడుదారులు బంగారం కొనుగోళ్లను ఆపడం లేదు. దీనితో మార్కెట్ లో అమ్మకం, కొనుగోళ్లు పెరిగాయి. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడటం, మరో మూడు రోజులో అక్షయ తృతీయ ఉండటంతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక ఆ రేట్ల విషయానికి వస్తే.., 22 క్యారెట్ల బంగారం ధర నేటి బులియన్ మార్కెట్ ప్రారంభానికి ముందు 10 గ్రాములు రూ.44,610 ఉంది. ఇక తులం బంగారం ధర ప్రస్తుతం రూ.35,688 ఉంది. 22 క్యారెట్ల బంగారంలో ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,461 ఉంది. ఇక పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర.. 10 గ్రాములు ఈ ఉదయానికి రూ.48,670 ఉంది. నిన్న ధరతో పోల్చుకుంటే ఇది రూ.510 తగ్గినట్టు. ఇక 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.39,936 ఉంది. ఇదే 24 క్యారెట్స్ ఒక్క గ్రాము ధర రూ.4,867 ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉండటం విశేషం. ఇక వెండి ధరల్లో కూడా స్థిరంగా కనిపిస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధరలు మళ్ళీ పెరిగాయి. ఈ ఉదయానికి కేజీ వెండి ధర రూ.76,500 ఉంది. నిన్న ధర కంటే ఇది 400 అధికం. అలాగే… 8 గ్రాములు అంటే తులం ధర రూ.612 ఉంది. ఇక ఒక్క గ్రాము వెండి ధర రూ.76.50 . అయితే.., ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. 6 నెలల కిందట నవంబర్ 11న వెండి ధర కేజీ రూ.63,300 ఉంది. ఇప్పుడు రూ.76,500 ఉంది. అంటే 6 నెలల్లో వెండి ధర రూ.13,200 పెరిగింది. మార్కెట్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇది భారీ పెరుగుదలని చెప్పుకోవచ్చు. అయితే.., ఇలా ధరలు పెరగడానికి మరో ముఖ్య కారణం అంతర్జాతీయంగా బంగారం దిగుమతులపై ఎక్కువ చెల్లించాల్సి రావడం. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ అంతకంతకు పడిపోతూ ఉండటంతో ఇలా దిగుమతులకు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన రానున్న రోజుల్లో కూడా బంగారం ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.