బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు. జూన్ 27న సమ్మెకు దిగనున్నట్టు యూనియన్లు ప్రకటించాయి. వారంలో ఐదు రోజుల పనిదినాలు కావాలని కోరుతూ సమ్మె చేయనున్నారు. అన్ని యూనియన్ల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లును వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు వరుసగా మూడు రోజులు మూతపడనున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వచ్చిన బ్యాంకు ఉద్యోగులు.. ఇప్పుడు వారంలో ఐదు రోజుల పనిదినాలు కావాలని కోరుతూ సమ్మె చేయనున్నారు. ప్రభుత్వం కనుక తమ డిమాండ్‌కు అంగీకరించకపోతే.. బ్యాంకు ఉద్యోగులు ఒక రోజు సమ్మె చేయనున్నట్టు 9 బ్యాంకు యూనియన్లకు చెందిన యూనిటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్‌బీయూ) చెప్పింది. ఈ నెల 27న సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బ్యాంకులు వరుసగా మూడు రోజులు మూతపడనున్నాయి. ఈ నెలలో 25వ తారీఖు నాలుగో శనివారం కాగా, 26వ తారీఖు ఆదివారం. ఈ రెండు రోజులు సాధారణంగానే బ్యాంకులకు సెలవు. ఇక 27వ తారీఖు సమ్మెకు దిగుతుండటంతో.. మొత్తంగా వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవు. Bank employees have threatened to go on a strike on June 27 seeking resolution of issues relating to pension and the demand for five days a week work.#Bank #BankStrike #Pension https://t.co/TV2hlftg4P — Oneindia News (@Oneindia) June 9, 2022 ఇది కూడా చదవండి: Dinesh Kumar Khara: SBI ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా జీతం ఎంతో తెలుసా..? ఐదు రోజుల పనిదినాలను ఆఫర్ చేయాలని బ్యాంకు ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రూల్ ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలన్నింటికి వర్తిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక 5 రోజుల పనిదినాలను, పెన్షన్ డిమాండ్లను అంగీకరించకపోతే.. ప్రభుత్వ రంగంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులం సమ్మెలో పాల్గొంటారని యూఎఫ్‌బీయూ పేర్కొంది.