బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 మరికొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ సీజన్ కు సంబంధించి అన్నీ లైవ్ అని చెప్పినా కూడా ముందే రికార్డు చేసి ఆ తర్వాత టెలికాస్ట్ చేస్తున్నారు కాబట్టి అన్ని విషయాలు ముందే బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే విన్నర్, రన్నర్ గురించి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. విన్నర్ గా బిందు మాధవి, రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచారంటూ ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం హోరెత్తిస్తున్నారు. అఖిల్ ఈసారి కూడా రన్నర్ అని చెబుతుండటంతో అతని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఓ లేడీ సభ్యురాలు టైటిల్ విన్నర్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నాన్ స్టాప్ సీజన్ మొత్తం కాస్త కొత్తగానే నిర్వహించారని చెప్పాలి. ఫినాలే వీక్ కు ఏకంగా ఏడుగురు సభ్యులను పంపడం, 12 వారాల సీజన్ లో 9వ వారంలో హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం చేశారు. అలాగే ఈ సీజన్ లో మరికొన్ని కొత్తగా చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి టాప్ 5 ప్లేస్ లు ఫిక్స్ అయిపోయాయి అంటున్నారు. బిందు మాధవి, అఖిల్ సార్థక్, యాంకర్ శివ, అరియానా, మిత్రా శర్మ టాప్ 5 ప్లేసుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈసారి ప్రైజ్ మనీ విషయంలోనూ కొన్ని షాకులు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి: తెలుగులో బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తొలి లేడీ బిందు మాధవి! View this post on Instagram A post shared by Anchor shiva (@anchorshiva) గేమ్ విషయానికి వస్తే యాంకర్ శివ ప్రేక్షకులనే కాదు, విమర్శకులను సైతం తన ఆటతో మెప్పించాడు. అందుకే శివకు బిగ్ బాస్ నుంచి స్పెషల్ ప్యాకేజ్ అందినట్లు తెలుస్తోంది. అదేంటంటే.. అతనికి రూ.25 లక్షలు క్యాష్ అందనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా అతను బిగ్ బాస్ సీజన్ 6కి కూడా ఎంపికైనట్లు చెబుతున్నారు. నిజానికి యాంకర్ శివ టైటిల్ ఫేవరెట్ అనే చెప్పచ్చు. కాకపోతే హౌస్ లోకి వచ్చే సమయంలో అతనికి సెలబ్రిటీ హోదా లేకపోవడం, బయట పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లేదు కాబట్టి టాప్ 3 ప్లేస్ కే పరిమితమయ్యాడు. ఇదీ చదవండి: బిందుమాధవిపై నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్! కానీ, అతని గేమ్ తో ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు. చివరికి బిగ్ బాస్ అతని గేమ్ కు ఫిదా అయిపోయి ఓ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అది స్పెషల్ ప్యాకేజా లేక విన్నర్ అమౌంట్ లో నుంచి తీసి ఇస్తున్నారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కాకపోతే బిగ్ బాస్ సీజన్ 6 ఎంట్రీ మాత్రం పక్కా అని చెబుతున్నారు. ఒక వేళ విన్నర్ అమౌంట్ లో నుంచి రూ.25 లక్షలు సూట్ కేస్ ఇచ్చి క్విట్ అవ్వమంటే శివ ఆ ఆప్షన్ కచ్చితంగా తీసుకుంటాడనే చెప్పాలి. యాంకర్ శివ టాప్ 3లో ఉండటం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: హౌస్ లోని సభ్యులపై నటరాజ్ మాస్టర్ సీరియస్.. దొంగ ఓట్లతో గెలుస్తున్నారు!