బిగ్ బాస్ హిస్టరీలో మొదటిసారి.. సీజన్ మొత్తం బ్యాన్ ఉన్నా కెప్టెన్ గా నటి ప్రియ

priya biggboss

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ సక్సెస్‌ఫుల్‌గా.. మోస్ట్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచడంలో తగ్గేదే లేదంటున్నాడు బిగ్‌బాస్‌. తాజాగా ప్రియాంకసింగ్‌ను వారి కుటుంబానికి దగ్గర చేసి బిగ్‌ బాస్‌ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అమ్మాయిగా మారిన విషయాన్ని ఇప్పటికీ తన తండ్రితో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రియాంకకు బిగ్‌బాస్‌ చేసిన పనితో ఆ బాధ తీరిపోయింది. ‘అమ్మాయి అయ్యావని నిన్న ఆదరించకుండా ఉంటామా? అబ్బాయి అయినా అమ్మాయి అయినా మాకు సర్వం నువ్వే’ అని పింకీ తండ్రి చెప్పిన మాటలు ఎందరినో ఆలోచనలో పడేశాయి. ఈ సన్నివేశం చూసైనా.. పింకీ తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకునైనా.. అలాంటి పరిస్థితుల్లో ఉన్న కొందరి జీవితాలైనా మారతాయని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఇదీ చదవండి: #PKLOVE హ్యాష్‌ టాగ్‌ తో పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌… నెట్టింట వైరల్‌

ట్విస్టులు, షాకుల్లో బిగ్‌ బాస్‌ను ఎప్పుడూ తీసిపారేయలేం. తాజాగా బిగ్‌ బాస్‌ ఇచ్చిన రెండు షాకులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కెప్టెన్సీ పోటీదారు టాస్కుకోసం రవిని, సన్నీని యువరాజుల హోదాలో నిర్వహించిన టాస్కులో ఓటింగ్‌ విధానంలో రవి గెలిచాడు. దొంగతనాలు చేసి సన్నీ టీమ్‌ సభ్యులు సిరి, జెస్సీ, షణ్ముఖ్‌ వెనకేసుకున్న నాణేలు అక్కరకు రాకపోగా.. ప్రత్యర్థులకు చేరాయి. ఆ దెబ్బతో ఇంట్లోని సభ్యులకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. మరో విషయం ఏంటంటే కెప్టెన్సీ పోటీదారులను ముగ్గురిని ఎంచుకోవాలని బిగ్‌బాస్‌ కోరగా.. హమీదా, శ్వేత, యానీ మాస్టర్‌ని రవి ఎంపిక చేస్తాడు. బిగ్‌బాస్‌ నటి ప్రియపై ఉన్న బ్యాన్‌ను ఎత్తివేస్తూ అనౌన్స్‌ చేయగానే అందరూ షాకవుతారు. హమీదా తన అవకాశాన్ని త్యాగం చేస్తూ ప్రియను పోటీదారుగా ఎంచుకుంటుంది. పోటీదారులుగా రవి, శ్వేత, ప్రియ నిలుస్తారు. ఇక కెప్టెన్‌ అయ్యేందుకు పెట్టిన టాస్కులో ఇంట్లోని సభ్యుల సహకారంతో ప్రియ కొత్త కెప్టెన్‌గా మారింది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో గతంలోనూ సీజన్‌ మొత్తం కెప్టెన్‌ అయ్యే అవకాశం లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, మొట్టమొదటిసారి ఆ బ్యాన్‌ను ఎత్తివేసి ప్రియకు అవకాశం కల్పించారు. పవర్‌ రూమ్‌లో హమీదాకు వచ్చిన అవకాశంతో ప్రియకు కెప్టెన్‌ అయ్యే అవకాశం లేకుండా చేసింది. ఇప్పుడు తన త్యాగంతో ప్రియను కెప్టెన్‌గా చేసి తన తప్పును సరిదిద్దుకుందని ప్రేక్షకులు, ప్రియ అభిమానులు ఖుషీ అయ్యారు. బిగ్‌ బాస్‌ ఇలా బ్యాన్‌ ఎత్తేసి ప్రియను కెప్టెన్‌ చేయడాన్ని మీరు సమర్ధిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.