‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’లో సన్నీపై తీవ్ర విమర్శలు.. టార్గెట్‌ చేశారా? అయ్యాడా?

sunny serious

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ గేమ్‌ రానురాను ఉత్కంఠగా మారిపోతోంది. ఈ సీజన్‌లో మొదటి వారం నుంచీ గొడవలు, విమర్శలు, ఆరోపణలు, గ్రూపులు, రాజకీయాలు ఉన్న విషయం తెలిసిందే. రానురాను అవి బాగా ముదురుతున్నాయి. బిగ్‌ బాస్‌ హౌస్‌ లో గ్రూపులుగా గేమ్ ఆడటం కొత్తేం కాదు. గత సీజన్లలో జరిగింది. ఈ సీజన్‌ లోనూ జరుగుతూనే ఉంది. వచ్చే సీజన్‌ లోనూ జరుగుతుంది. దానిని ఎవరూ తప్పు బట్టరు. కానీ, ప్రస్తుతం ఆ గొడవలు తారస్థాయికి చేరుతున్నాయి. అందుకు తాజాగా హౌస్‌ లో సన్నీ, షణ్ముఖ్‌ ల మధ్య జరిగిన గొడవే ఉదాహరణ. సన్నీ రానురాను కేకలు వేయడం, ఇంట్లోని సభ్యులపైకి దూసుకెళ్లడం అలావాటైపోయింది.

sunny seriousఎంత చెప్పినా అదే ధోరణి..

పలుమార్లు సన్నీకి నాగార్జున క్లాస్‌ పీకినా కూడా షరామాములే అయిపోయింది. సన్నీకి ఉన్న బలహీనత.. ఎవరు ప్రొవోక్‌ చేసినా తట్టుకోలేడు. ఆ విషయం తెలుసుకున్న సభ్యులు దానిని ఉపయోగించుకుని సన్నీని ప్రవోక్‌ చేయడం చేస్తున్నారు. ఒత్తి అంటించిన హైడ్రోజన్‌ బాంబులా సన్నీ ఇంక సౌండ్‌ చేస్తాడు. సన్నీ ఆ కాసేపు కోపంలో కేకలు వేస్తాడు. కానీ చాలా మంచిగా ఉంటాడు ఇంట్లోని సభ్యులతో. గిల్లి జోలపాడితే ఎలా అనేది మిగిలిన సభ్యుల వాదన. కోపంలో మాటలు అనేసి సారీ చెప్పేస్తే సరిపోదు కదా? అని ప్రశ్నించిన సందర్భాలు కోకొల్లలు. నాగార్జున కూడా చాలాసార్లు చెప్పాడు. సన్నీ బాగా ఆడుతున్నావ్‌.. కోపాన్ని కంట్రోల్‌ చేసుకో అంటూ.

sunny seriousఎన్ని గొడవలు..

సన్నీ చేసిన రచ్చ గురించి ఒక ఉదాహరణ కాదు చాలా చెప్పవచ్చు. మొదటివారంలో ‘రా’ అని పిలిచినందుకు 7 ఆర్ట్స్‌ సరయు గొడవతో మొదలు పెట్టి.. నిన్న మొన్న సిరి- షణ్ముఖ్‌లతో జరిగిన గొడవ దాకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా సన్నీ చేసే తప్పు ఏంటంటే.. కోపంలో అరవడం ఆ తర్వాత ఆ మాట నేను అనలేదు అని బుకాయించడం. శనివారం, ఆదివారం నాగార్జున వచ్చి ఆ వీడియో ప్లే చేసి చూపించడం జరుగుతూనే ఉంటుంది. వ్యక్తిగతంగా మంచివాడే అయినా కూడా సన్నీ అలా లూజ్‌ టంగ్‌ తో మాటలు జారడం వివాదాలకు దారి తీస్తున్నాయి. ‘నేను లోపల ఏదీ దాచుకోను.. అప్పుడే బయట పెట్టేస్తా’ అంటూ సన్నీ చేసిన వ్యాఖ్యలు చాలా మంచివి. లోపల ఒకటి పెట్టుకుని బయటకి ఇంకోలా వ్యవహరించడం హర్షించదగిన విషయం కాదు. కానీ, అలా నోరు పారేసుకోవడం కూడా హర్షించదగిన విషయం కాదు.

sunny seriousప్రవోకింగ్‌ కావాలనేనా?

కొన్ని సందర్భాల్లో సన్నీని కావాలనే ఇంట్లోని సభ్యులు ప్రవోక్‌ చేస్తారు అనిపించేది. టాస్కుల విషయంలో సన్నీ ఎంతో స్ట్రాంగ్‌ కంటెండర్‌. అతడిని ఫిజికల్‌ ఓడించడం అంటే కాస్త కష్టమనే చెప్పాలి. అందుకే ముందు మెంటల్‌గా డిస్ట్రబ్‌ చేసి ఆ తర్వాత కంట్రోల్‌ తప్పేలా చేస్తుంటారు. ప్రతిసారి ఆ విషయంలో వాళ్లు విజయం సాధించారు. ఈ విషయంలో ఉదాహరణలు చాలానే ఉన్నాయి. సింగర్‌ శ్రీరామ్‌, యాంకర్‌ రవి, యానీ మాస్టర్‌, సిరి ఇలా దాదాపు అందరూ ఆ ట్రిక్‌ను ప్లే చేశారు. రెండుసార్లు వరస్ట్‌ పర్ఫార్మర్‌గా జైలుకు వెళ్లింది కూడా అలా ప్రవోక్‌ అయ్యి గొడవ చేసినందుకే.

వీజే సన్నీ కచ్చితంగా టాప్‌-5 కంటెండర్‌. కానీ, అతను తన బిహేవియర్‌ మార్చుకోకుండా ఇలాగే ఉంటే ముందుకు సాగడం కష్టం అనేది ప్రేక్షకుల అంచనా. తాజాగా హౌస్‌ నుంచి బయటకు వచ్చిన జెస్సీ చెప్పింది కూడా అదే. కోపంలో మాటలు జారొద్దు. సన్నీ ఆ ఒక్క విషయాన్ని కంట్రోల్‌ చేసుకోగలిగితే అతను కచ్చితంగా బిగ్‌ బాస్‌ లో చివరి వరకు ప్రయాణం చేయగలడు. సన్నీ బిగ్‌ బాస్‌లో బాగా ఆడుతున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.