పక్క పక్కనే బెడ్స్ వేసుకుని పడుకోవాలా? సిరి, షణ్ముఖ్ రిలేషన్ పై ఉమాదేవి సంచలన కామెంట్స్

వారాలు గడిచే కొద్దీ.. బిగ్ బాస్ హౌస్ లో హీట్ పెరుగుతోంది. హౌస్ లో బూతు పురాణం అందుకున్న ఉమాదేవి ఎలిమినేట్ అయిపోయింది. కార్తీక దీపం సీరియల్ ఫ్యాన్స్ ఉమాదేవిని ఎలిమినేషన్ నుండి తప్పించడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ వృధా అయ్యాయి. అయితే..హౌస్ నుండి బయటకి వచ్చాక కూడా ఉమాదేవి మాటల్లో పదును తగ్గలేదు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ బిగ్ బాస్ బజ్ కి గెస్ట్ గా రావడం ఆనవాయితి. ఇందులో భాగంగానే ఉమాదేవి కూడా అరియనా హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ బజ్ లో పాల్గొంది. అయితే.. తాజాగా విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమోలో సిరి, షణ్ముఖ్ పై ఉమాదేవి సంచలన కామెంట్స్ చేసింది.

సిరి-షణ్ముఖ్..ఇద్దరూ కలసి గేమ్ ఆడుతున్నారు. వీళ్లిద్దరూ బయట ప్లాన్ చేసుకొచ్చి ఇక్కడ అందరిని పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నారు. ఎలిమినేషన్ ప్రాసెస్ అప్పుడు వారిని ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోరు. టాస్క్ ల సమయంలో ఒకరికి ఇంకొకరి సపోర్ట్ ఉంటుంది. సరయు కూడా వెళ్తూ, వెళ్తూ ఇదే విషయాన్ని చెప్పిందని ఉమాదేవి గుర్తు చేసింది. వీళ్లిద్దరూ సైగలు చేసుకుని హమీదాని ఎలా టాస్క్ నుంచి తప్పించారో సరయు వీడియోలో చూపించి బండారం బట్టబయలు చేసింది కూడా. దీంతో.. ఇప్పుడు సిరి, షణ్ముఖ్ కలసి గేమ్ ఆడుతున్నారన్న విషయం స్పష్టంగా బయటపడి పోయింది. ఈ నేపథ్యంలోనే సిరి, షణ్ముఖ్ రిలేషన్ పై కూడా ఉమాదేవి సంచలన కామెంట్స్ చేసింది.

Bigg Boss 5 Uman Devi Sensational Comments on Siri, Shanmukh - Suman TVఅసలు సిరి-షణ్ముఖ్ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి? వాళ్ళు ఫ్రెండ్స్ ఏంటి? కలసి గేమ్ ఆడాలి అనుకుంటే ఇంట్లో ఆడుకోవచ్చు కదా? . మంచాలు కూడా పక్క పక్కనే వేసుకుంటారా?? దాని పక్కనే వాడు మంచం వేసుకోవాలా?? బయటకు వచ్చిన తరువాత కూడా వాళ్లిద్దరి మధ్యన ఇదే ప్రేమ ఉంటుందా? అంటూ.. ఉమాదేవి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఉమాదేవి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.