కన్నీటిపర్యంతమైన లోబో, నటరాజ్ మస్టర్

lobo nataraj

కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ ఎట్టకేలకు ప్రారంభమైంది బిగ్ బాస్ 5 తెలుగు. ప్రారంభమైన నాటి నుంచి బుల్లితెర ప్రేక్షకులకు భారీ వినోదాన్ని అందిస్తోంది. అయితే షో మొదలై ఇప్పటికీ నాలుగు రోజులు ఘనంగా పూర్తి చేసుకుంది. ఇందులో భావోద్వేగపూరితమైన సంభాషణలు, ఒకరిని ఒకరు తిట్టుకోవటం, గొడవలు పడటం వంటివి చూస్తున్నాం.

అయితే తాజాగా 5వ రోజుకు సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఇందులో ముఖ్యంగా నేడు వినాయక చవితి కావటంతో సభ్యులందరూ రంగు రంగుల దుస్తువులు ధరించి వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రధానంగా లోబో, నటరాజ్ మాస్టర్, యాంకర్ రవి ఇంకా ఒకరు ఇద్దరు ఏడుస్తున్నట్లు మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. అయితే ప్రోమోలో చూస్తే గనుక భావోద్వేగానికి గురై నటరాజ్ మాస్టర్ ఏడుస్తూంటే లోబో వచ్చి తాను కూడా ఏడ్చి ఓదార్చినట్లుగా ప్రోమోలో అర్ధమవుతోంది.

biggboss5 teluguఇక వారు టాస్క్ లో భాగంగా ఏడ్చారా..? లేదంటే నటరాజ్ మాస్టర్ గర్భవతిగా ఉన్న తన భార్యను గుర్తుకు తెచ్చుకుని ఏడ్చారా అన్నది కాస్త అనుమానంగా మారింది. ఇదే కాకుండా యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్ పోటాపోటీగా గొడవకి దిగటం కూడా ప్రోమోలో చూపించారు. మరి వీళ్లిద్దరికి గొడవెందుకు జరిగిందనే కాస్త ఆలోచించే విధంగా మారింది. ఇక వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే ఈ రోజు బిగ్ బాస్ 5 తెలుగు 5వ రోజు షోను పూర్తిగా చూడాల్సిందే మరి.