సండే అండే ఫన్‌ డే అంటున్న కింగ్‌ నాగ్.. ట్రాక్‌ లు, క్రష్‌ ల గురించే ముచ్చట్లు

nagarjuna biggboss telugu

బుల్లితెర ప్రేక్షకులకు ‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ ప్రారంభమయ్యాక ఎంటర్‌టైన్మెంట్‌కు కొదవ లేకుండా పోయింది. రోజూ ఒకలెక్క కింగ్‌ నాగ్‌ ఎంటరయ్యాక ఒక లెక్క అన్నట్లు ఉంటోంది షో. శనివారం, ఆదివారం 5 మచ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ లభిస్తోంది. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్‌లో పెద్దగా తెలిసిన ముఖాలు లేవంటూ కామెంట్లు వచ్చినా.. ఎక్కడా తగ్గకుండా ప్లాన్‌ చేస్తున్నారు. ఎమోషన్స్‌ అన్నీ చూపిస్తూ కయ్యం, కన్నీరు ఎపిసోడ్లను బాగా హైలెట్‌ చేస్తున్నారు. సదరు ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. కిచెన్‌ మొదలు బాత్‌ రూమ్‌ వరకు పాయింట్‌ ఏదైనా ఎవరో ఒకరు ఏదొక రీజన్‌తో అరిచేస్తున్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నవారు.. ఒక్క నిమిషంలో ఫైర్‌ బ్రాండ్‌ అవతారం ఎత్తేస్తున్నారు. ఇవన్నీ పక్కకు నెడుతూ నాగార్జున కొత్త టాస్క్‌తో ముందుకొచ్చాడు.

siri jessi biggbossఇద్దరు చొప్పున కంటెస్టెంట్లను రెడ్‌ కార్పెట్‌పై కూర్చోబెట్టి కొన్ని ఇంట్రస్టింగ్‌ ప్రశ్నలు అడిగాడు. అందుకు అందరూ చాలా ఫన్నీగా, ఆసక్తిగా సమాధానాలు చెప్పారు. కెప్టెన్‌ సిరి హన్మంత్‌ని, మోడల్‌ జశ్వంత్‌ అప్పుడే ఎందుకు ఎంగేజ్‌ అయిపోయావ్‌ అంటూ క్వశ్చన్‌ చేస్తాడు. నాగ్‌ కూడా మంచి ప్రశ్న అనగా.. అందుకు సిరి హన్మంత్‌ నువ్వు వస్తావని తెలీక అంటూ సమాధానమిస్తుంది. అంటే ఇక్కడ ఏదో నడిపించాలని బిగ్‌ బాస్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సిరిని అమాంతం ఎత్తేస్తాడు మన సింగర్‌ శ్రీరాముడు. ఏంటి ఏం జరుగుతోందంటూ అభిమానులు అవాక్కవుతున్నారు.

lobo umaషో మొత్తంలో లోబో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. అదే విషయాన్ని నాగార్జున కూడా ప్రస్తావించాడు. శనివారం బాత్‌రూమ్‌లో నటి ఉమాదేవితో లోబో నడిపిన ప్రేమ ముచ్చట్లు మామూలుగా లేవు. బాగా గట్టిగానే ట్రై చేస్తున్నాడు లోబో. ఆదివారం రెడ్‌ కార్పెట్‌పై లోబో, ఉమానే కలిసి డాన్స్‌ చేశారు. వారిద్దరి జంట చూడచక్కగా ఉందంటూ నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. మరి ఆ వార్తలు వింటే లోబో రెడ్‌ కార్పెట్‌పై పడినట్లే కళ్లు తిరిగి పడిపోతాడేమే అంటున్నారు. షణ్ముఖ్‌, నటి ప్రియ డ్యాన్స్‌ కూడా చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండబోతోంది. ప్రియాంక సింగ్‌, మానస్‌ ట్రాక్‌ ఆసక్తిగా ఉంటోంది. ప్రియాంక ఇచ్చిన పువ్వులు దాచిపెట్టడం. లోబో లైన్‌ వేస్తే మానస్‌కు చెప్తా అనడం వంటివి ఏదో జరుగుతున్నట్లు చూపిస్తున్నారు.

priyanka crushనాగార్జున అడిగిన ఓ ప్రశ్నకు ప్రియాంక సమాధానం చెబితే ఓ క్లారిటీ వస్తుంది. ప్రియాంక సింగ్‌ క్రష్‌ ఎవరూ అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే ఆదివారం సాయంత్రం 9 గంటల వరకు ఆగాల్సిందే. ఈ ప్రోమో యూట్యూబ్‌లో తెగ వైరల్‌ అవుతోంది.