బిగ్‌ బాస్‌ హౌస్‌ లో సిరి- షణ్ముఖ్‌ రిలేషన్‌ పై స్పందించిన సిరి తల్లి

siri mother

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ హౌస్‌ మొత్తం ప్రస్తుతం ఎమోషన్స్‌ తో నిండిపోయింది. ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ వచ్చి హౌస్‌ మేట్స్‌ తో సరదాగా గడుపుతున్నారు. కాజల్‌ ఫ్యామిలీ, మానస్‌ తల్లి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. సిరి మదర్‌ కూడా హౌస్‌ లోకి వచ్చారు. తల్లిని చూసి సిరి చిన్నపిల్లలా ఏడ్చుకుంటూ వెళ్లి హగ్‌ చేసుకుంది. ఆ తర్వాత సిరి తల్లి చేసిన కామెంట్స్‌ ఆమెను, షణ్ముఖ్‌ ను షాక్‌ కు గురిచేశాయి. సిరి- షణ్ముఖ్‌ హౌస్‌ లో ఉంటున్న తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఎమోషనల్‌ గా కనెక్ట్‌ అవుతున్నాను అంటూ సిరి చేసిన కామెంట్స్‌ తో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. మరోవైపు దీప్తి సునైనా స్పందించకపోవడం కూడా సంచలనం రేపింది.

నాకు నచ్చడంలేదు..

సిరిని గట్టిగా హగ్‌ చేసుకున్న ఆమె తల్లి మాట్లాడిన మాటలు సిరిని, షణ్ముఖ్‌ ని షాక్‌ కు గురిచేయడమే కాదు.. కాస్త ఆందోళనకు కూడా గురి చేశాయి. ‘షణ్ముఖ్‌ ని నువ్వు హగ్‌ చేసుకోవడం నాకు నచ్చడం లేదు. హౌస్‌ లో షణ్ముఖ్‌ నీకు చాలా సపోర్ట్‌ గా ఉంటున్నాడు. కానీ, అలా చేయడం నాకు నచ్చడం లేదు’ అని డైరెక్ట్‌ గా చెప్పేసింది. ఆమె మాటలతో ప్రేక్షకులు సైతం అవాక్కయ్యారు. ఎందుకంటే అలాంటి ఆరోపణలు వస్తున్న సమయంలో ఆమె తల్లి సపోర్ట్‌ చేస్తుందని అనుకోగా.. ఆమె అలా మాట్లాడేసరికి అందరూ షాక్‌ అయ్యారు. సిరి తల్లి చేసిన కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.