బిగ్‌ బాస్‌-4 విన్నర్‌ అభిజిత్‌ సినిమాలు చేయకపోవడం వెనుకున్న అసలు కారణం!

తెలుగులో ‘బిగ్‌ బాస్‌’కున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఆ షోతో ఫేమస్‌ అయిన వారు ఎందరో ఉన్నారు. కెరిర్‌లో కుప్పలుతెప్పలు అవకాశాలు అందుకున్న వారిని కూడా చూశాం. ప్రస్తుత సీజన్‌ బాగా హీట్‌గా నడుస్తోంది. అయితే ఈ బిగ్‌ బాస్‌ సీజన్‌ సందర్భంగా గత సీజన్ల విజేతల ప్రస్తావన బాగా వస్తోంది సోషల్‌ మీడియాలో. అందులో భాగంగా అందరూ అభిజిత్‌ గురించి బాగా సెర్చ్‌ చేస్తున్నారు. ఎందుకు అభిజిత్‌ సినిమాలు చేయడం లేదని అభిమానులు తెగ అడిగేస్తున్నారు.

శేఖర్‌ కమ్ముల తీసిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాతో మంచి క్రేజ్‌, నేమ్‌ తెచ్చుకున్న అభిజిత్‌ బిగ్‌ బాస్‌ 4లోకి అడుగుపెట్టాడు. వచ్చింది మొదలు విజేతగా నిలిచే దాకా అభిజిత్‌ చాలా క్లాస్‌గా మిస్టర్‌ కూల్‌గా పేరు పొందాడు. అతని గేమ్‌ అందరూ ఫిదా అయిపోయారు. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాడు. ఇక, అభిజిత్‌ కెరీర్‌లో అవకాశాలు తెగ వచ్చేస్తాయి అని అందరూ అనుకున్నారు. కానీ, అభిజిత్‌ ఎక్కడా ఏ అప్‌డేట్‌ ఇవ్వలేదు. మళ్లీ ‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ సీజన్‌ షురూ అయ్యింది కూడా.

abhijeet biggbossమధ్యలో కొన్నిరోజులు అభిజిత్‌ ఆరోగ్యం బాలేదని. హెల్త్‌ ఇష్యూస్‌ ఉన్నాయని పుకార్లు షికార్లు చేశాయి. అందుకే అభిజిత్‌ నటించట్లేదంటూ చెప్పుకొచ్చారు. తాజాగా అభిజిత్‌ స్పందించిన తీరు చూస్తే అది నిజమే అని తెలుస్తోంది. అప్‌డేట్లు లేవేంటని అడుగుతున్న ఫ్యాన్స్‌కు ‘నా ఆరోగ్యమే నాకు మొదటి ప్రాధాన్యత. ప్రస్తుతం దానిపైనే నా దృష్టి’ అంటూ అభిజిత్‌ అభిమానులకు సమాధానమిచ్చాడు. దీంతో అందరూ అభిజిత్‌ స్క్రీన్‌ మీదకు త్వరగా రావాలని కోరుకుంటున్నారు.