షణ్ముఖ్ మాటలతో వాష్ రూమ్ కెళ్లి తలుపేసుకున్న సిరి!

shannu siri fight

‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’లో ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల టాస్కుతో కాస్త రచ్చే నడుస్తోంది. బిగ్‌ బాస్‌ ‘నీ ఇల్లు బంగారం గాను’ టాస్కు ఇచ్చాడు. అంటే ఇంట్లోని సభ్యులు గోల్డ్‌ మైనింగ్‌ చేసే వారిలా మారాలి. వారు బంగారాన్ని వెలికి తీయాలు. అందుకోసం ఒక టబ్‌లో అన్ని రకాల ధర్మాకోల్‌ బాల్స్‌తో పాటు బంగారు రంగు పూసలను ఉంచారు. ప్రతి బజర్‌కు ఇంట్లోని సభ్యులు బంగారు పూసలను వెలికి తీయాలి. అలా వెలికి తీసిన పూసలను సైతం వారే కాపాడుకోవాలి. ఆ టాస్కులో సన్నీ- యానీ మాస్టర్‌ మధ్య ఆసక్తికర సంఘటనలు జరిగాయి. మరోవైపు రవి- షణ్ముఖ్‌లు సైతం పూసల విషయంలో మజాక్‌ ఆడుకున్నారు. ఇక ప్రియాంక సింగ్‌ అయితే నెక్ట్స్‌ లెవల్‌ దొంగతనమే ప్లాన్‌ చేసి దొరికిపోయింది.

మళ్లీ గొడవ..

తాజా ప్రోమోలో సిరి- షణ్ముఖ్‌ ల మధ్య మళ్లీ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వాష్‌ రూమ్‌లో షణ్ముఖ్‌ ను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆమెను షణ్ముఖ్‌ దూరంగా పొమ్మని కోరతాడు. విదిలించుకుంటాడు, కసురు కుంటాడు. సిరి తన ముఖాన్ని కొట్టుకుంటుంది. ఆ తర్వాత కూడా షణ్ముఖ్‌ గట్టిగా కసురుకోవడంతో సిరి వెంటనే వాష్‌ రూమ్‌లోకి వెళ్లి డోర్‌ లాక్‌ చేసుకుంటుంది. అప్పటి వరకు వారికి స్పేస్‌ ఇద్దాం. వాళ్లను మాట్లాడుకోనిద్దాం అని ఊరుకున్న వారు షాకయ్యారు. వెంటనే అందరూ వచ్చి సిరి డోర్ తీ అంటూ కేకలు వేశారు. ఆమె చివరకు డోర్‌ తీసింది. అసలు కారణాలు ఎపిసోడ్‌ లోనే తెలుస్తాయి.

జెస్సీ లేడని బాధ..

ముందురోజు నుంచి షణ్ముఖ్‌- సిరి బాధగానే కనిపిస్తున్నారు. సిరి అన్నం తినిపించాలని కోరినా కూడా షణ్ముఖ్‌ అవాయిడ్‌ చేశాడు. ఆమె చాలా మూడాఫ్‌ అయ్యింది. షణ్ముఖ్‌ వాష్‌ రూమ్‌ లో మాటల్లో ‘వాడుంటే నేను కింగ్‌ లా ఉండేవాడిని. నువ్వు నాకు అక్కర్లేదు. నేను ఎప్పుడు వెళ్లాలో నాకు తెలుసు’ వంటి కామెంట్స్‌ చేశాడు. జెస్సీని షణ్ముఖ్‌ బాగా మిస్‌ అవుతున్నాడు. ఆ బాధ కాస్తా సిరిపై కోపంగా మారినట్లు కనిపిస్తోంది.