‘బిగ్‌బాస్‌ హౌస్‌’లో ఎప్పటికీ కెప్టెన్‌ కాలేనిది ఎవరో తెలుసా?

Biggboss5 Telugu

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తోంది. మొదటి రోజు నుంచే హౌస్‌లో యాక్షన్‌, డ్రామా, ఎమోషన్‌ స్టార్ట్‌ అయిపోయింది. ప్రతి ఎపిసోడ్‌, ప్రతి ప్రోమో వేరే లెవల్‌లో ఉంటున్నాయి. ప్రతి ప్రేక్షకుడిని బుల్లితెరకు కట్టిపడేస్తోంది. గత నాలుగు సీజన్ల కంటే ఈసారి గట్టిగా ప్లాన్‌ చేశారంటూ ప్రశంసలు వస్తున్నాయి. హౌస్‌లో కంటెస్టెంట్లను చూడగానే వారిలో సగం మంది ప్రేక్షకులకు ఎక్కువ పరిచయం లేనివారే కనిపించారు. ఈ సీజన్‌ ఫ్లాప్‌ అవుతుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్త పరిచారు. కానీ, వాటన్నింటిని పక్కకు తోస్తూ ఈ సీజన్‌ అన్నిటి కన్నా ఎంటర్‌టైనింగ్‌ ఉండబోతోందని విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ సీజన్‌లో కొత్తగా పరిచయం చేసిన ‘పవర్‌ రూమ్‌’ కాన్సెప్ట్‌, అందులో విజయం సాధించిన వారికి ఇస్తున్న పవర్స్‌ చాలా ఆసక్తిగా ఉంటున్నాయి. పవర్స్‌ అందుకున్న విశ్వ, మానస్‌.. యాంకర్‌ రవి, ప్రియ, ఆర్జే కాజల్‌ను ఎంచుకుని వారికి పనిష్మెంట్‌ ఇచ్చారనే చెప్పాలి. ఇప్పుడు తాజాగా ఆ పవర్స్‌ హమీదాకు దక్కాయి. అది కూడా అలాంటి ఇలాంటి పవర్స్‌ కాదు.. ‘బిగ్‌ బాస్‌ హౌస్‌ 5 తెలుగు’ సీజన్‌ మొత్తం వారు కెప్టెన్‌ కాలేరు. మరి, అంతటి గొప్ప పవర్స్‌ని ఎవరి మీద ప్రయోగించబోతోందన్న ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. అయితే ఆ దురదృష్టవంతురాలు ‘లహరి షేరీ’ అని కొందరు గట్టిగా చెప్తున్నారు.

hamida

అందుకు కారణం కూడా ఉందిలెండి. పోయిపోయి ముందురోజే లహరి హమీదాతో కయ్యానికి కాలు దువ్వింది. ఎలా మాట్లాడాలో నేర్పించే ప్రయత్నం చేసి హమీదా ఆగ్రహానికి గురైంది. ఆ సంఘటన తర్వాత హమీదా కళ్లనీళ్లు పెట్టుకుంది కూడా. ఆ తర్వాత కిచెన్‌లో ఇద్దరూ కలిసిపోయారు. కలిసి అంట్లు తోముతా అంటూ హమీదా మాట కలిపింది. అక్కడితే ఆ గొడవ సద్దుమణిగింది అని అనుకుంటున్నారు. కానీ, ఈ పరవర్స్‌ వచ్చిన నేపథ్యంలో హమీదా కచ్చితంగా వాటిని లహరిపైనే ఉపయోగిస్తుందని తెలుస్తోంది. ఏం చేస్తాం చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అన్న సామెతను లహరికి ఆపాదిస్తున్నారు అభిమానులు. మరి, ఆ ప్రోమో మీరు కూడా చూసేయండి.

ఈ వారం నామినేషన్‌లో యాంకర్‌ రవి, ఆర్జే కాజల్‌, మోడల్‌ జశ్వంత్‌, హమీదా, మానస్‌, సరయు ఉన్న విషయం తెలిసిందే.