రవిపై షణ్ముఖ్‌ సీరియస్‌.. ఇక్కడ మేమంతా జోకర్లమా అంటూ షాకింగ్‌ కామెంట్స్‌

shanmukh ravi bigboss5

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ సీజన్‌లో అప్పుడే క్లైమాక్స్‌ స్టైల్‌ యుద్ధాలు మొదలయ్యాయి. ఇప్పిటకే ఇంటి సభ్యులు గ్రూపులుగా విడిపోయారు. వారివారి అభిప్రాయాలను వారి స్నేహితులతో పంచుకుంటున్నారు. షణ్ముఖ్‌ కూడా కొన్ని రోజులుగా యాక్టివ్‌ అయ్యాడు. సిరితో మాత్రం కాస్త డిస్టన్స్‌ మెయిన్‌టైన్‌ చేస్తున్నాడు. ఆ విషమై సిరి హన్మంత్‌, ఆర్జే కాజల్‌తో తన మనసులోని మాటలు షేర్‌ చేసుకుంటుంది. ‘ఒకవేళ నేనే తప్పుగా అనుకుంటున్నానేమో.. నా గేమ్‌ ప్లే నచ్చడంలేదేమో?’ అంటూ సిరి చెప్పుకొచ్చింది. మరోవైపు షణ్ముఖ్‌.. జెస్సీ మాటలకు ఇన్‌ఫ్లూఎన్స్‌ అవుతున్నాడంటూ ఆరోపించింది. ఆ తర్వాత ఆర్జే కాజల్‌ షణ్ముఖ్‌తో మాట్లాడుతూ కనిపించింది.

రవిపై షణ్ముఖ్‌ సీరియస్‌

రవి గురించి మాట్లాడుతూ షణ్ముఖ్‌ సీరియస్‌ అయ్యాడు. లోబో, రవి గేమ్‌ గురించి ఆర్జే కాజల్‌తో మాట్లాడాడు. ‘వాళ్లు ఇద్దరు కలిసే గేమ్ ఆడుతున్నారు. లోబో ప్రతివారం రవిని ఎందుకు నామినేట్‌ చేస్తున్నాడు? ఇదంతా వాళ్ల గేమ్‌ ప్లాన్‌ అయి ఉంటుంది. కావాలనే వాళ్లు ఇలా చేస్తున్నారు. రవిని నామినేషన్‌లో ఎవరైనా ఒక్క మాట అన్నా లోబో వెంటనే వాళ్లని తిట్టేస్తాడు. మళ్లీ హౌస్‌లో ఫ్రెండ్‌షిప్‌ లేదంటూ చెప్తారు’ అని షణ్ముఖ్‌.. కాజల్‌ చెప్పాడు. అందుకు కాజల్‌ రియాక్ట్‌ అవుతూవాళ్ల ప్లాన్‌ ఏంటో కొంచం కూడా అర్థం కావడం లేదు. ‘నాకు ఇక్కడ ఉండాలని లేదు.. నేను వెళ్లిపోతానని లోబో నాతో అన్నాడు. మరి అది రవిని ఉద్దేశించి అన్నాడో ఏమో తెలీదు. క్లూ కూడా లేదు. కానీ, ఆ మాటలు జెన్యూన్‌గా అనిపించాయంటూ కాజల్‌ అంటుంది.

shanmukh jaswanth bigboss5

మీ స్కిట్లు బయట చేసుకోండి

రవి అందరిని గైడ్‌ చేస్తున్నాడు. అతనికి నచ్చినట్లు అందరూ ఆడాలంటూ ఇన్‌ఫ్లూఎన్స్‌ చేస్తున్నాడంటూ షణ్ముఖ్‌ ఆరోపించాడు. ‘జెస్సీకి లవ్‌ ప్రపోజ్‌ చేయమని రవి.. లోబోకి చెప్తున్నాడు. అతనెవరు ఎవరు ఏ కంటెంట్‌ చేయాలో చెప్పడానికి.. అప్పటి నుంచే దూరంగా ఉంటున్నా. ఇక్కడికి అందరూ కష్టపడే వచ్చారు. వాళ్ల స్కిట్లు ఏమైనా ఉంటే బయట చేసుకోవాలి ఇక్కడ కాదు’ అంటూ రవిపై ఓ రేంజ్‌లో సీరియస్‌ అయ్యాడు షణ్ముఖ్‌. ఇదిలా ఉంటే రవికి షణ్ముఖ్‌ దూరంగా ఉండటానికి కారణం జెస్సీ అని సిరి హన్మంతు భావిస్తోంది. జెస్సీ మాటలు వినే రవి ఇలా చేస్తున్నాడని అనుకుంటోంది. మరి అసలు విషయం ఎప్పుడు తెలుసుకుంటుందో చూడాలి.

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, గాసిప్స్‌, ఎలిమినేషన్స్‌ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్‌ టీవీ వెబ్‌సైట్‌ని చూస్తుండండి.