బిగ్ బాస్ హౌస్ లో కొట్లాట.. హద్దులు దాటిన హౌస్ మేట్స్

biggboss fighting

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీవీ రియాలిటీ షోగా పేరు గాంచింది. గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్‌లో ఇంటి సభ్యులు చాలా వరకు బయట పెద్దగా పరిచయం లేనివారే వచ్చారు. కానీ, ఎంటర్‌టైన్మెంట్‌ విషయంలో మాత్రం అన్ని సీజన్ల కంటే ఈసారి ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారని అభిప్రాయాలు వస్తున్నాయి. అందుకేనేమో బిగ్‌ బాస్‌ హౌస్‌లో గొడవలు, గిల్లి గజ్జాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, దుర్భాషలు, దుమ్మెత్తి పోసుకోటాలు, ఆరోపణలు, విమర్శలు అన్నీ దాటి ఇంక ముష్టి యుద్ధాల బాట పట్టారు ఇంటి సభ్యులు. ఇంట్లో అంతమంది సభ్యులు ఉన్నప్పుడు ఏది ఒకరే కెప్టెన్‌ కావాలి అంటే వారిలో ఎవరు సమర్థులో వారే అందుకు అర్హులు అది తెలుసుకునేందుకు బిగ్‌ బాస్‌ పలు రకాల టాస్కులు పెడుతుంటాడు. ఆ టాస్కుల ద్వారా ఎవరు కెప్టెన్‌ అయ్యేది తేలుతుంది. అందులో భాగంగానే బిగ్‌ బాస్‌ హౌస్‌లో కెప్టెన్సీ పోటీదాలు కోసం ఒక టాస్కు నడుస్తోంది.

అందులో ఇంట్లోని సభ్యులు తమ సహనం కోల్పోయి మరీ దారుణంగా ఒకరినొకరు కొట్టుకున్నారు. టాస్కులను మరీ పర్సనల్‌గా తీసుకుంటున్న ఇంటి సభ్యులు తామే గెలవాలంటూ కొట్టుకుంటున్నారు. ఒకసారి దాదాపు ఇదే సీన్‌ జరిగితే కింగ్‌ నాగార్జున వారిని మందలించాడు. మళ్లీ అదే తరహాలు ఇంట్లోని సభ్యులు అంతా గ్రూపులుగా తమ బృందాన్ని నెగ్గించుకునే క్రమంలో ఫిజికల్‌ ఫైట్‌కు తెరలేపారు. టాస్కుల విషయంలో బాగా సీరియస్‌గా ఉండే విశ్వ మరోసారి అదే ప్రవర్తన కనిపించింది. దొంగతనంగా ఆడుతున్నారంటూ విశ్వ ఇంట్లోని సభ్యులను ఆరోపించాడు. అదే సమయంలోనే మానస్‌ కూడా కలగజేసుకోవడంతో టాస్కు అంతా ఫిజికల్‌గా మారిపోయింది. రవి, సన్నీ రాకుమారులుగా మొదలైన ఈ టాస్కు ఇప్పుడు మొత్తం కొట్లాటకు దారి తీసింది. ఇప్పటి వరకు బాగా ఎంజాయ్‌ చేసిన ప్రేక్షకులు సైతం.. ఇప్పుడు విమర్శించడం మొదలు పెట్టారు. ఇంటి సభ్యులు టాస్కుల్లో ఈ విధంగా ప్రవర్తించడం సరైందేనా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.