‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’పై మెగా బ్రదర్‌ నాగబాబు రియాక్షన్‌!

nagababu biggboss

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరి నోట విన్నా ‘బిగ్‌ బాస్‌’ మంత్రమే. డబుల్‌ కాదు.. ఐదురెట్లు ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌ లభిస్తోంది. అప్పుడే బిగ్‌ బాస్‌ హౌస్‌లో గిల్లిగజ్జాలు షురూ అయ్యాయి. ఎడుపులూ, ఫిర్యాదులు, టాస్కులు అబ్బో ఒకటా రెండా ఇళ్లంతా రచ్చరచ్చగా ఉంది. సదరు ప్రేక్షకుడికి అయితే పిచ్చ ఎంటర్‌టైన్మెంట్‌ అందుతోంది. పవర్‌ రూమ్‌ కాన్సెప్ట్‌, ఇచ్చే టాస్కులు వీర లెవల్లో ఉన్నాయి. సగం వాగ్వాదాలు అందుకోసం కూడా జరుగుతున్నాయి. లేడీ డ్రెస్‌లో అయితే రవి హొయలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆర్జే కాజల్‌ నిద్ర కోసం నానా తిప్పులు పడుతోంది. లహరి అయితే ఒకరి తర్వాత ఒకరికి వార్నింగ్‌లు ఇచ్చేస్తోంది. ఎవరు ఎలా ప్రవర్తించాలో క్లాసులు తీసుకుంటోంది. హమీదా తక్కువనా నువ్వేంటి నాకు నేర్పేది అంటూ గట్టిగానే సమాధానమిచ్చింది.

ఇక హౌస్‌లో గొడవలు పక్కకు పెడితే బయట వారి సపోర్టర్లు సోషల్‌ మీడియా యుద్ధాలే చేస్తున్నారు. ఓట్‌ ఫర్‌ మావోడు అంటూ క్యాంపైన్‌లు నడిపిస్తున్నారు. లోపల వారు ఎలాఉన్న బయట మాత్రం ఫుల్‌ పబ్లిసిటీతో ఊదర కొడుతున్నారు. జశ్వంత్‌కు సూచనలు ఇస్తూ బిగ్‌బాస్‌ విన్నర్‌ కౌశల్‌ సందేశాన్ని విడుదల చేశాడు. ఆ చర్యతో చెప్పకనే తన సపోర్ట్‌ జశ్వంత్‌కు ఉంటుందని చెప్పేశాడు. ఇప్పుడు తాజాగా మెగా బ్రదర్‌ నాగబాబు ‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’పై స్పందించాడు. హౌస్‌లో ఉన్న సభ్యుల్లో యాంకర్‌ రవి, నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌, నటి ప్రియ, సింగర్‌ శ్రీరామ్‌లు చాలా క్లోజ్‌ అని నాగబాబు చెప్పుకొచ్చారు. అయితే, వీరందరూ ఒకెత్తు అయితే ఆయనకు ప్రియాంక సింగ్‌ అలియాస్‌ సాయితేజ ఒకెత్తని వెల్లిడించారు.

nagababu biggbossప్రియాంక సింగ్‌ తనకు ముందు నుంచి పరిచయమని, సర్జరీ తర్వాత ప్రియాంక సింగ్‌ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు నాగబాబు చెప్పారు. లైఫ్‌లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ప్రియాంక సింగ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రావడం చాలా సంతోషంగా ఉందని నాగబాబు తెలిపారు. ప్రియాంక సింగ్‌ టైటిల్‌ గెలుస్తుందో లేదో తెలీదు గానీ తన పూర్తి మద్దతు మాత్రం ప్రియాంక సింగ్‌కు ఉంటుందని నాగబాబు స్పష్టం చేశారు.

ఈ వారం నామినేషన్‌లో యాంకర్‌ రవి, ఆర్జే కాజల్‌, మోడల్‌ జశ్వంత్‌, హమీదా, మానస్‌, సరయు ఉన్న విషయం తెలిసిందే.