గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కాలి గజ్జకు ఆపరేషన్ తర్వాత.. పూర్తి కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ నెల 22 నుంచి వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రాహుల్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఇండియన్ ఉమెన్స్ టీమ్ స్టార్ బౌలర్ జులన్ గోస్వామి కూడా అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేశారు. జులన్ గోస్వామి […]
క్రికెట్ అభిమానులకు వినోదం.. బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ లీగ్‌లో ఆడేందుకు చాలా మంది క్రికెటర్లు కలలు కంటారు. రీచ్ క్యాష్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌ను చూసి చాలా దేశాల్లో అలాంటి లీగ్‌లు పుట్టుకొచ్చాయి. కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లాంటి టోర్నీలు చాలానే వచ్చాయి. తాజాగా ఇలాంటి లీగ్‌ను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా ప్రారంభించనుంది. కాగా.. […]
1993లో యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో షేన్ వార్న్ విసిరిన బంతి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. మ్యాచ్‌లో రెండో రోజు వార్న్ బౌలింగ్‌కి రాగా.. అప్పుడు క్రీజులో ఇంగ్లాండ్ బ్యాటర్ మైక్ గాటింగ్ ఉన్నాడు. అప్పటికే ఇంగ్లాండ్ టీమ్‌లో గాటింగ్ అగ్రశ్రేణి బ్యాటర్.. అలానే స్పిన్‌ని ఆడటంలోనూ అతనికి మెరుగైన రికార్డ్ ఉంది. కానీ.. ఆరోజు మొదటి బంతికే గాటింగ్‌ని షేన్ వార్న్ తన స్పిన్‌తో నోట్లో […]
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అందర్ని షాక్‌కు గురిచేయగా.. అంతకు ముందు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ దినేష్ రామ్‌దిన్ కూడా సోమవారం ఉదయం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వీరిద్దరితో పాటు మరో కరేబియన్ స్టార్ క్రికెటర్ లెండిల్ సిమన్స్ కూడా సోమవారం నాడే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సిమన్స్ 2006లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే […]
భారత్‌తో మూడు వన్డేల సిరీస్ ముగిసిన మరుసటి రోజే ఇంగ్లండ్ జట్టు స్టార్ ఆల్‌రౌంటర్, టెస్టు జట్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మంగళవారం సౌతాఫ్రికాతో జరిగే వన్డే ఈ ఫార్మాట్‌లో తన చివరి మ్యాచ్ అని సోమవారం ప్రకటించాడు. బెన్‌స్టోక్స్ నిర్ణయం అందరిని షాక్‌కు గురిచేసింది. మూడు ఫార్మాట్లలో కొనసాగేందుకు తన శరీరం సహకరించడం లేదని అందుకే వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు స్టోక్స్ పేర్కొన్నాడు. తన ఆల్‌రౌండ్ […]
టన్నుల కొద్ది రన్స్ కొట్టిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం బ్యాడ్‌ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టు, వన్డే సిరీస్‌లలో దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో కోహ్లీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కోహ్లీ స్థానంలో యువ క్రికెటర్లకు స్థానం కల్పించాలనే డిమాండ్ వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ నుంచి విరాట్ కోహ్లీని విశ్రాంతి పేరుతో […]
ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌ను ఇండియా, రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలుపొందాయి. దీంతో ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో సిరీస్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. కీలక పోరులో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడా విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు రిషభ్ పంత్, హార్థిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతంగా ఆడి […]
గత నెల న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ జో రూట్ బ్యాట్‌ను నేలపై నిటారుగా చేతితో పట్టుకోకుండా నిలబెట్టాడు. రూట్ అలా బ్యాట్ నిలబెట్టిన వీడియో అప్పుడు వైరల్‌గా మారింది. మ్యాజిక్ చేసి గాల్లో బ్యాట్ నిలబెట్టాడంటూ బోలెడు వార్తలు వచ్చాయి. తన బ్యాట్ కింది భాగం ఫ్లాట్‌గా ఉండడంతో రూట్ బ్యాట్‌ను అలా నిలబెట్టినట్లు తర్వాత తెలిసింది. కాగా రూట్ బ్యాట్‌తో చేసిన మ్యాజిక్‌ను ఇంగ్లండ్‌తో రీ షెడ్యూల్డ్ […]
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. 260 పరుగుల లక్ష్యాన్ని 42.1 ఓవర్లలో కేవలం 5 వికెట్లు కోల్పోయి ఛేదించి.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ విజయంలో టీమిండియా నయా డాషింగ్ బ్యాటర్ రిషభ్ పంత్(113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో 125 నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను అద్భుత సెంచరీతో అదుకున్నాడు. […]
రాజ్యసభలో సోమవారం కొత్తగా 25 మంది ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ కూడా ఒకరు. అలాగే తన సహచర ఆటగాడు గౌతమ్ గంభీర్ ఇప్పటికే లోక్ సభ ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో ఇద్దరు పార్లమెంట్‌లో కలుసుకున్నారు. అలాగే ఈ ఇద్దరూ కలిసి తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో ఫొటో దిగారు. ఆ ఫొటోను ఎంపీ రామ్మోహన్ నాయుడు తన అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్టు చేస్తూ.. ‘భారత్‌ను గర్వించేలా చేసిన […]