సీఎం జగన్ కొత్త క్యాబినెట్ ఖరారు చేసిన అనంతరం, కొందరు తాజా మాజీల్లోనూ, పలువురు ఆశావహుల్లోనూ అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. ఏపీ కొత్త కేబినెట్‌లో తమ నేతలకు మంత్రి పదవులు దక్కలేదని పలు చోట్ల వైసీపీ శ్రేణులు ఆందోళనలకు దిగారు. అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ పదవులు వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఆత్మహత్య యత్నాలు కూడా చేస్తున్నారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరి ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇది చదవండి: ఓటములు, అవమానాలు, కన్నీళ్లు దాటి.. నేడు మంత్రిగా!
కేబినెట్లో ఎస్సీ మంత్రులందరినీ కొనసాగించి తనపై వేటు వేయడంపై సుచరిత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ఆమెను బుజ్జగించే పనిలో సీనియర్ నేతలు ఉన్నారు. మరికొంత మంది కీలక నేతలు రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు దక్కని వారు అసహనానికి గురి కావొద్దని.. సీఎం జగన్ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం వీళ్లందరూ కట్టుబడి ఉంటారు. వీళ్లు నా మనుషులు, వీళ్లను పదవి నుంచి తీసినా బాధపడరు అని సీఎం జగన్ భావించారని అన్నారు. దయచేసి ఎవరూ ఏడుపులు, శోకాలు పెట్టొద్దు అన్నారు. పార్టీ కోసం కట్టుబడి ఉండాలని.. జగన్ వెనుక సైనికుల్లా నిలబడాలని అన్నారు. జగన్ అందరికీ న్యాయం చేస్తారని ఎవరూ అసంతృప్తి చెద్దవొద్దని హితవు పలికారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.