చిత్రం                : జేమ్స్ నటీనటులు      : పునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ఆదిత్యమీనన్ తదితరులు బ్యానర్               : కిషోర్ ప్రొడక్షన్స్ సంగీతం             : చరణ్ రాజ్ సినిమాటోగ్రఫీ   : స్వామి జే. గౌడ ఎడిటింగ్             : దీపు ఎస్. కుమార్ నిర్మాత                : కిషోర్ పత్తికొండ రచన – దర్శకత్వం: చేతన్ కుమార్

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ‘జేమ్స్’. ఆయన మరణానంతరం ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో.. ఈ సినిమా పై అంచనాలకంటే ఎక్కువగా ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడింది. పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా అయినప్పటికీ.. 

జేమ్స్ సినిమా పట్ల ఫ్యాన్స్ అభిమానం ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. రిలీజ్ కు ముందే అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ గా ట్రైలర్ తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుపుకుంది. 

ఈ సినిమాలో పునీత్ క్యారెక్టర్ కి అతని సోదరుడు శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పడం విశేషం. మార్చి 17న పునీత్ పుట్టినరోజు సందర్బంగా ‘జేమ్స్’ చిత్రం విడుదలైంది. మరి ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం! 

(కథ) వరల్డ్ డార్క్ మాఫియాలో ఆరితేరి.. ఇండియాలో సిండికేట్స్ మెయింటైన్ చేస్తున్న విజయ్ గైక్వాడ్(శ్రీకాంత్) కుటుంబానికి ప్రాణాపాయం ఉందని తెలిసి ఓ దమ్మున్న సెక్యూరిటీ గార్డ్ కోసం ఎదురు చూస్తుంటారు. 

జేమ్స్ ట్రేడ్ మార్క్ సంతోష్ కుమార్(పునీత్ రాజ్ కుమార్).. ఎదుటివాడు ఎంతటివాడైనా ఢీకొట్టే స్వభావం కలవాడని తెలుసుకొని గైక్వాడ్ ఫ్యామిలీకి గార్డ్ గా నియమించుకుంటారు. ఈ క్రమంలో గైక్వాడ్ వారసురాలు నిషా(ప్రియా ఆనంద్) సంతోష్ తో ప్రేమలో పడుతుంది. 

కట్ చేస్తే.. సంతోష్ కుమార్ వచ్చింది గైక్వాడ్ ఫ్యామిలీని లేపేయడానికే అని తెలుస్తుంది. మరి అసలు సంతోష్ కి, గైక్వాడ్ ఫ్యామిలీకి ఉన్న వైరం ఏంటి? సంతోష్ కి జేమ్స్ అని పేరు ఎలా వచ్చింది? చివరికి సంతోష్ – నిషా లవ్ ఏమైంది? అనేది మిగిలిన కథ. 

(విశ్లేషణ) పునీత్ రాజ్ కుమార్ అలియాస్ అప్పు సినిమా.. అంటే మేజర్ గా మాస్ యాక్షన్ అంశాలు దండిగా ఉంటాయానే సంగతి తెలిసిందే. జేమ్స్ సినిమా పునీత్ చివరి సినిమా అయినప్పటికీ.. ప్రేక్షకులు రెగ్యులర్ సినిమాలాగే రిసీవ్ చేసుకుంటారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో.. పునీత్ రాజ్ కుమార్ ని చాలా స్టైలిష్ గా చూపించారు. గార్డ్ గా, మిలిటరీ మేజర్ గా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో పునీత్.. చెలరేగిపోయారు. 

కథా కథనాల పరంగా జేమ్స్.. కొన్ని యాక్షన్ సినిమాలను కలగలిపినట్లుగా ప్రేక్షకులు పసిగట్టేస్తారు. సినిమాలో కథ, కథనాలు పక్కన పెడితే.. కంప్లీట్ పునీత్ యాక్షన్ షోనే ‘జేమ్స్’ అని చెప్పవచ్చు. 

పునీత్ లాస్ట్ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ లో జేమ్స్ సినిమాలోని లోటుపాట్లను పెద్దగా పట్టించుకోరు. ఆయన అభిమానులు కోరుకునే మాస్ యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉండటంతో ఎక్కడ కూడా బోర్ అనిపించదు. 

ముఖ్యంగా పునీత్ సినిమా అని అభిమానంతో చూసేవారికి జేమ్స్.. అదిరిపోయే ఫీస్ట్ అవుతుంది. సినిమాలో జేమ్స్ అలియాస్ మేజర్ సంతోష్ గా పునీత్ రఫ్ఫాడించాడు. ఆయన చేసిన రిస్కీ సీక్వెన్సులు ఎవరు చేయలేరేమో అనే స్థాయిలో చేశారు. పునీత్ ని నటుడుగా చూడటానికి బదులుగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు.  

నిషా గైక్వాడ్ గా ప్రియా ఆనంద్.. తన పరిధిమేరకు ఆకట్టుకుంది. ఆమెది చెప్పుకోదగ్గ క్యారెక్టర్ కానప్పటికీ.. స్క్రీన్ ప్రెసెన్స్ కొత్తగా ఉంది. విలన్స్ గా శ్రీకాంత్, శరత్ కుమార్, ఆదిత్య మీనన్ లు ముగ్గురు కూడా విలనిజంతో మెప్పించారు.  

కానీ విలన్స్ గా దర్శకుడు ఇంట్రడక్షన్ ఇచ్చిన లెవెల్ చివరిలో తగ్గిందేమో అనిపిస్తుంది. కంప్లీట్ యాక్షన్ మూవీ కాబట్టి సినిమాలో కామెడీ ఎక్సపెక్ట్ చేయొద్దు. ప్రధాన పాత్రలు తప్ప సైడ్ క్యారెక్టర్స్ అన్ని తేలిపోయాయి. జేమ్స్.. పక్కా పునీత్ వన్ మ్యాన్ షో.. 

(టెక్నీషియన్స్ పనితీరు) దర్శకుడు చేతన్ కుమార్.. రాసుకున్న కథ, యాక్షన్ థ్రిల్లర్ అంశాలు ఇదివరకే వేరే సినిమాలలో చూసామేమో అనిపిస్తుంది. తెలుగు, తమిళంలోనే జేమ్స్ తరహా కథలు, యాక్షన్ ఘట్టాలు దర్శకులు బోయపాటి, హరి లాంటివారు చూపించేశారు.

స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్ అనిపించినా.. చేతన్ టేకింగ్ చాలా స్టైలిష్ గా ఉంది. పునీత్ ని ఫ్యాన్స్ మెచ్చే విధంగా స్లో మోషన్స్, ఫైట్స్ చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. సినిమాలో శివరాజ్ కుమార్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. 

మేజర్ ఆనంద్ రాజ్ గా ఆయన ఎంట్రీ స్పెషల్ ఎస్సెట్. స్వామి గౌడ సినిమాటోగ్రఫీ బాగుంది. చరణ్ రాజ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో యాక్షన్ సీన్స్ ని ఎలివేట్ చేశారు. నిర్మాత కిషోర్ పత్తికొండ ప్రొడక్షన్ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. 

(మేజర్ ప్లస్ లు) పునీత్ రాజ్ కుమార్ యాక్షన్ మ్యూజిక్ ప్రొడక్షన్ వేల్యూస్ సినిమాటోగ్రఫీ

(చివరిమాట) పక్కా పునీత్.. మాసీవ్ వన్ మ్యాన్ షో!

(గమనిక) పునీత్ రాజ్ కుమార్ పై గౌరవార్థం సినిమాకు రేటింగ్‌ ఇవ్వడం లేదు.

పునీత్ రాజ్ కుమార్ 1975 - 2021   We Miss You Sir...