వెండితెరపై నటించాలని చాలా మంది అనుకుంటారు. కానీ, ఆ అవకాశం అందరికీ రాదు. కొంత మందికి అనుకోకుండానే అవకాశం రావచ్చు.

ఇంకొంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా రాకపోవచ్చు. కానీ, ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్నవాళ్లని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.  

షార్ట్ ఫిల్మ్స్‌, వెబ్‌ సిరీస్ లతోనే వెండితెరపై ఛాన్సులు కొట్టేస్తున్నారు. అలా భీమ్లానాయక్ సినిమాలోకి ‘హరిణి’గా వచ్చిన అమ్మాయే మౌనికా రెడ్డి. 

మౌనికారెడ్డి వైజాగ్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. సాఫ్ట్ వేర్‌ కంపెనీలో హెచ్ ఆర్ గా చేస్తూనే నటనపై తనకున్న మక్కువతో వెబ్ సిరీస్ లలో నటించింది.  

రీసెంట్ యూట్యూబ్ సెన్సేషన్ ‘సూర్య’ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ లో నటించింది. వాటిలో వచ్చిన క్రేజ్ తో భీమ్లానాయక్ లో అవకాశం కొట్టేసింది. 

అది కూడా సాదా సీదా పాత్ర కాదు. సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే సన్నివేశంలో పవన్ తర్వాత ప్రధాన పాత్రలో నటించింది. 

‘సెట్స్ లో మొదట పవన్‌ కల్యాణ్ తో మాట్లాడేందుకు భయమేసింది. ఆ విషయం తెలుసుకుని ఆయనే నాతో మాట్లాడారు’ అంటోంది. 

అంతేకాదు మౌనికా రెడ్డికి ఇప్పుడు వెండితెర అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఆహా, సోనీలైవ్ ఓటీటీ ప్లాట్ ఫామ్లతోనూ కలిసి పనిచేస్తోంది.  

నిఖిల్, సిద్ధార్థ ’18 పేజెస్’, విశ్వక్ ‘ఓరి దేవుడా’, సురేష్ ప్రొడక్షన్స్ ‘కథ’ సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది.  

హార్డ్‌ వర్క్, టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయని మౌనికా రెడ్డి నిరూపిస్తోంది. ఇన్‌ స్టాలోనూ అమ్మడికి భారీగానే ఫాలోయింగ్ ఉంది. ఆమెకు 3 లక్షల 62 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 

మౌనిక రెడ్డి లేటెస్ట్ ఫొటోస్

Arrow