టాలీవుడ్ లో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మాస్ మూవీ ‘భీమ్లా నాయక్’.మరి రిలీజ్ ముందు నుండే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన భీమ్లా నాయక్ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథనం – విశ్లేషణ:
భీమ్లా నాయక్ ట్రైలర్ లో చెప్పినట్లుగానే అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగిన యుద్ధమే ఇది. మలయాళంలో బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.
డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – మాటలు అందించిన ఈ స్క్రిప్ట్ లో తెలుగు నేటివిటీ కోసం చాలా మార్పులే చేశారు. కానీ ఎక్కడా మలయాళం ఫ్లేవర్ పోకుండా జాగ్రత్తపడ్డారు.
కథతో పాటు సాగే సన్నివేశాలు కాబట్టి మలయాళంలో కనిపించిన సీన్స్ భీమ్లా నాయక్ లో కనిపిస్తాయి. ఒరిజినల్ స్క్రిప్ట్ డిస్టర్బ్ అవ్వకుండా స్క్రీన్ ప్లే ప్లాన్ చేసుకున్నారు.
ఇక సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కి లోటే లేదు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రేసీ స్క్రీన్ ప్లే ఎక్కడా బోర్ ఫీల్ రానివ్వదు.
ముఖ్యంగా మలయాళం చూడకుండా కొత్తగా భీమ్లా నాయక్ చూసేవారికి ఈ సినిమా ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. తెలుగులో ఇద్దరు హీరోలు ఉన్న సినిమాలు చాలా వచ్చాయి కానీ..
ఇద్దరు హీరోలకు సమానంగా పవర్ ఫుల్ రోల్స్ ఇచ్చి.. ఇగో క్లాషెస్ కథతో అయితే సినిమాలు రాలేదు. ఖచ్చితంగా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు భీమ్లా నాయక్ పర్ఫెక్ట్ పిక్చర్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే విధంగా భీమ్లా నాయక్ ని.. మాస్ – క్లాస్ అంశాలతో ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. ఒరిజినల్ మూవీ మలయాళంలో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
అలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా రూపొందించడంలో మేకర్స్ సక్సెస్ అందుకున్నారు.
ఒరిజినల్ చూసినప్పటికి భీమ్లా నాయక్ లో థ్రిల్ కలిగించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా పవన్ – రానాలు ఎదురుపడిన ప్రతి సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
ఇక సినిమాలో ఎక్కడ కూడా పవర్ స్టార్ అనే స్థాయిని, భల్లాలదేవ రానా అనే స్థాయిలను సినిమాలోకి తీసుకురాలేదు. ఈ విషయంలో రచయిత – దర్శకుడిని అభినందించాలి.
పవన్ – రానాల తర్వాత సినిమాలో చెప్పుకోదగిన పాత్ర భీమ్లా భార్య సుగుణ. నిత్యమేనన్ ఈ పాత్రకు చాలా న్యాయం చేసింది.
డానీయల్ తండ్రి పొలిటికల్ లీడర్ జీవన్ బాబుగా సముద్రఖని.. కనిపించింది తక్కువ సీన్సలో అయినప్పటికీ మాస్ సీన్స్ లో మెప్పించారు.
దర్శకుడిగా సినిమాకి ఏమేమి కావాలో అన్ని నటుల నుండి రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు.
సినిమాటోగ్రఫీ లెజెండరి రవి కే చంద్రన్ గారు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్స్, యాక్షన్ ఘట్టాలలో కెమెరాతో ఇంటెన్సిటీ క్రియేట్ చేశారు.
మ్యూజిక్ సెన్సేషన్ తమన్.. భీమ్లా నాయక్ పై ఫస్ట్ హైప్ తీసుకొచ్చిన పర్సన్. పాటలతో పాటు సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి న్యాయం చేశాడు. ఎక్కువ తక్కువ కాకుండా సినిమాకి కావాల్సినంతే ఇచ్చి సంతృప్తి పరిచాడు.
చివరి మాట: పక్కా.. భీమ్లా నాయక్ విశ్వరూపం! రేటింగ్: 7/10