ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం తప్పనిసరి అయ్యింది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాసులు వల్ల వీటి వినియోగం మరింత పెరిగి.. ఇంటికి నాలుగైదు ఫోన్లు అన్నట్టుగా మారింది.

ఈ క్రమంలో అందరూ చీప్ అండ్ బెస్ట్ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసం ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ టెక్నో సీ సరి కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది.

టెక్నో స్పార్క్ 8 సిరీస్లో మరో స్మార్ట్ఫోన్ విడుదలైంది. గతంలో తీసుకొచ్చిన టెక్నో స్పార్క్ 8 కి కొనసాగింపుగా ఈ లేటెస్ట్ వర్షన్ ను తీసుకొచ్చింది. టెక్నో స్పార్క్ 8సీ పేరుతో ఎంట్రీ లెవెల్ మొబైల్ను భారత్లో సోమవారం (ఫిబ్రవరి21) లాంచ్ చేసింది.

6జీబీ ర్యామ్ ఉన్న అతి తక్కువ ధర మొబైల్ ఇదేనని టెక్నో కంపెనీ చెబుతోంది. అయితే ఈ ఫోన్ 3జీబీ ర్యామ్తో వస్తుండగా.. వర్చువల్గా 3జీబీ వరకు ర్యామ్ను పొడిగించుకునే ఫీచర్ ఉండనుంది. 

దీంతో మొత్తంగా 6జీబీ ర్యామ్ అవుతుందని టెక్నో కంపెనీ పేర్కొంది. అలాగే 64జీబీ స్టోరేజ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటివి హైలెట్గా ఉన్నాయి.

టెక్నో స్పార్క్ 8సీ స్పెసిఫికేషన్స్

6.6 అంగుళాల హెచ్డీ+ డాట్ నాచ్ డిస్ప్లే

ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టం

ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్

90 హెట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్

బ్యాక్ 13 మెగాపిక్సల్ ఏఐ కెమెరా

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా

5000ఎంఏహెచ్ బ్యాటరీ

ఫింగర్ ప్రింట్ స్కానర్ వెనుక వైపు

ఈ మొబైల్ డైమండ్ గ్రే, మాగ్నట్ బ్లాక్, ఐరిష్ పర్పుల్, టార్కూస్ సియాన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఈ నెల 24 నుంచి అమెజాన్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.