ప్రధాన టెలికం సంస్థలు రిలయన్స్    జియో (Reliance Jio), ఎయిర్‌టెల్‌  (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone  Idea - Vi) ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఇటీవల  చాలా మార్పులు వచ్చాయి. దాదాపు       అన్ని ప్లాన్‌ల ధరలు పెరిగాయి.

ఇదే తరుణంలో కొన్ని కొత్త ప్లాన్‌లను    తీసుకొచ్చాయి ఆ కంపెనీలు. ఇదే  తరుణంలో కొన్ని ప్లాన్‌ల వ్యాలిడిటీని      సైతం తగ్గించాయి. దీంతో చాలా  మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ  నేపథ్యంలో జియో, వొడాఫోన్ ఐడియా,             ఎయిర్‌టెల్‌ నుంచి రూ. 

        150లోపు ప్రీపెయిడ్ ప్లాన్లు ఎలా         ఉన్నాయో చూడండి. తక్కువ          వ్యాలిడిటీ ప్లాన్లు కావాలనుకునే  వారికి ఈ ప్లాన్లు చాలా ఉపయోగకరంగా                     ఉండనున్నాయి. 

    రూ.150లోపు రిలయన్స్ జియోలో  రెండు అన్ లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్లు       ఉ న్నాయి. రూ.119తో రీచార్జ్      చేసుకుంటే 14రోజుల వ్యాలిడిటీ      అందిస్తోంది జియో. ఈ ప్లాన్‌ కింద    రోజుకు 1.5జీబీ డేటా, అన్ లిమిటెడ్   కాల్స్, 300ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. 

   జియో రూ.149 ప్లాన్‌ (Jio Rs 149 Plan)తో   రీచార్జ్ చేసుకుంటే 20 రోజుల వ్యాలిడిటీతో  రోజుకు 1జీబీ డేటా లభిస్తుంది. దీంతోపాటు  అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్  లు దక్కుతాయి. అలాగే ఇవే ప్రయోజనాలు               ఇచ్చే రూ.179 ప్లాన్‌ కూడా 

కూడా అందుబాటులో ఉంది. అయితే  ఈ ప్లాన్‌తో 4రోజుల వ్యాలిడిటీ ఎక్కువ  ఉంటుంది. ఈ ప్లాన్‌లతో జియో టీవీ,  జియో సినిమా లాంటి జియో యాప్స్     ఉచితంగా వినియోగించుకోవచ్చు. 

వొడాఫోన్ ఐడియా (Vi) కూడా రూ.150లోపు  ప్యాకేజీలను అందిస్తోంది. రూ.149 రీచార్జ్       ప్లాన్‌ కింద రోజుకు 1జీబీ డేటా, అన్    లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. ఈ ప్లాన్‌     వ్యాలిడిటీ 21 రోజులు. అయితే ఉచిత             ఎస్ఎంఎస్ లు లభించవు. 

   వొడాఫోన్ ఐడియా రూ.129 ప్లాన్ (Vi Rs.       129 Plan)తో రీచార్జ్ చేసుకుంటే 18       రోజుల వ్యాలిడిటీతో 200ఎంబీ డేటా,           అన్ లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.  అయితే ఎస్ఎంఎస్ సదుపాయం ఉండదు. 

    ఇక రూ.155 ప్లాన్‌ ద్వారా 24 రోజుల       వ్యాలిడిటీతో రోజుకు 1జీబీ డేటా  వస్తుంది. అలాగే అన్ లిమిటెడ్ కాల్స్ ,      300ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. 

    రూ.150లోపు ఎయిర్‌టెల్‌లో అన్  లిమిటెడ్ ప్లాన్లు అందుబాటులో లేవు.    అయితే రూ.155 ప్లాన్‌ ఉంది. దీంతో  రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1జీబీ డేటా,  అన్ లిమిటెడ్ కాల్స్, 300ఎస్ఎంఎస్     లు లభిస్తాయి. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ                24రోజులు ఉంటుంది. 

అలాగే ఎయిర్‌టెల్‌ రూ.179 ప్లాన్‌ (Airtel   Rs.179 Plan) తో రీచార్జ్ చేసుకుంటే      రోజుకు 2జీబీ డేటా, అన్ లిమిటెడ్  కాల్స్, 300ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.  ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులు. అలాగే     ఫ్రీ హలోట్యూన్, వింక్ మ్యూజిక్ ను      ఉచితంగా వినియోగించుకోవచ్చు.