చైనా బ్రాండ్ Xiaomi ఇండియాలో కొత్తగా 11T Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.
ప్రస్తుతం ఈ మొబైల్ amazon.in, mi.com, ప్రధాన ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.
ఈ-కామర్స్ ద్వారా Xiaomi 11T Pro కొనుగోలు పై సిటీ బ్యాంక్ కస్టమర్లకు 5000 క్యాష్బ్యాక్ ఇస్తుంది.
Mi Home, Mi Studios లతో పాటు ఆఫ్లైన్ స్టోర్లలో ఈ ఆఫర్ అమలులో ఉంది.
Xiaomi 11T Pro ప్రతి కొనుగోలు పై Mi ఉచితంగా బ్యాండ్ 5ని అందిస్తోంది.
సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 11T Pro కొనుగోలుపై రూ. 3000 వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు.
ఈ మొబైల్ ఆఫర్స్ గురించి పూర్తి వివరాలకోసం దగ్గరలోని Mi స్టోర్ ని సంప్రదించండి.
జనవరి 31 వరకే Xiaomi 11T Pro పై రూ.5000 వరకు ఎక్స్చేంజి ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
11T Pro మొబైల్ 6.67 ఇంచెస్ HD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది.
ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్(Samsung 5nm ప్రాసెస్)తో రూపొందించబడింది.
11T Pro 5000 mAh బ్యాటరీ కలిగి 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రానుంది.
కెమెరా పరంగా 108MP ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్, 5MP మైక్రోలను కలిగి ఉంటుంది.
ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.