కాశీకి వెళ్తే కాయో- పండో వదిలి రావాలి అని పెద్దలు చెబుతుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే.

గంగలో కోరికచెప్పి ఏదైనా ఇష్టమైన వస్తువు వదిలి రావాలి అని కూడా వింటుంటారు.

అయితే కాయో- పండో వదిలిరావాలా? అసలు పురాణాలు ఏం చెబుతున్నాయి?

అయితే పురణాల్లో ఎక్కడా కూడా కాయ- పండు వదిలి రావాలి అని చెప్పలేదు.

గంగలో పుణ్యస్నానం ఆచరించి ‘కాయాపేక్ష, ఫలాపేక్షను వదిలి’ ఆ కాశీ విశ్వనాథుడ్ని దర్శించుకోవాలని పురణాలు చెబుతున్నాయి.

అంటే కాయాపేక్ష(ఈ శరీరంపై మమకారాన్ని), ఫలాపేక్ష(కర్మ ఫలంపై ఆపేక్షను) వదిలి రావాలని తెలియజేశారు.

కాయాపేక్ష, ఫలాపేక్షను రానురాను కాయా- పండుగా మార్చేశారు.

శరీరంపై ఆపేక్షను, కర్మ ఫలంపై ఆపేక్షను వదిలి స్వచ్ఛమైన మనస్సుతో ఆ శివయ్యను ఆరాధించాలని తెలియజేస్తున్నారు.