అధిక బరువు, ఊబకాయం, ఒబేసిటీ.. పేరు ఏదైనా ఇప్పుడు ఈ సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు.

వ్యాయామం చేయడం వల్ల మార్పు వస్తుందని అందరూ చెప్తుంటారు. కానీ, అది అందరికీ కుదరకపోవచ్చు

కొన్ని చిట్కాలు, టెక్నిక్స్ తో వ్యాయామం చేయకుండానే బరువు తగ్గేయచ్చు.

రోజుకు 2 నుంచి 4 లీటర్ల నీరు తాగడం మంచిది. భోజనం చేయడానికి ఒక అరగంట ముందు మంచినీళ్లు తాగితే మీకు ఎక్కువ ఆకలి కాదు.

మనం ఎంత వద్దు అనుకున్నా మనసుని, ఆకలిని కంట్రోల్ చేయలేం. కాకపోతే తినే పోర్షన్లను తగ్గించుకోవచ్చు.

చిన్న ప్లేట్ వాడటం వల్ల కొంచమే పెట్టుకున్నా ఎక్కువ అన్న ఫీలింగ్ వస్తుంది.

తినే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. సగం సగం తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.

జంక్ ఫుడ్ మన శరీరంపై చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. జంక్ ఫుడ్ లో ఫ్యాట్, కేలరీలు ఎక్కువ ఉంటాయి.

జంక్ ఫుడ్ వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువ తయారవుతుంది.

స్నాక్స్ ఎప్పుడూ హెల్తీగా ఉండాలి. ముఖ్యంగా ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమం.

ఆకుకూరలు, కూరగాయలను కూడా ఉపయోగించడం మంచిది.

మంచినిద్ర, ప్రశాంతంగా ఉండటం కూడా ఎంతో ముఖ్యం.

మనిషి ఎంత ఒత్తిడిని తగ్గించుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాడు అనేది అందరికీ తెలిసిన విషయమే.

గమనిక: ఈ చిట్కాలు అధ్యనాల ప్రకారం ఇచ్చినవి. ఇది మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ముందుగా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.