సరైన హిట్ లేక కొట్టుమిట్టాడుతున్న రవితేజ  కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిన చిత్రం క్రాక్.    రవితేజ పెర్ఫార్మెన్స్ & యాక్షన్  సీన్స్ లో  రవితేజ మ్యానరిజమ్స్ మాస్ ఆడియన్స్ కు                   ఫుల్ మీల్స్ పెట్టాయి.

   నటుడిగా అల్లరి నరేష్ కు లైఫ్ ఇచ్చిన  సినిమా “నాంది”. ఈ సినిమా కోసం నరేష్  పడిన కష్టం, ఆఖరికి డబ్బింగ్ విషయంలో  కూడా తీసుకున్న జాగ్రత్తలు అతడ్ని హీరోగా          మంచి స్థాయిలో నిలబెట్టాయి.

      “ఉప్పెన” చూసిన ఎవ్వరైనా ఇది ఈ  అబ్బాయి మొదటి సినిమా అంటే నమ్మడం  కష్టం. సాధారణ ప్రేమకథ అయినప్పటికీ..            చక్కని పరిణితి ప్రదర్శించాడు.

జాతి రత్నాలు సినిమాలు ఒకరు హీరో, ఒకరు         ఫ్రెండ్ అని విడదీయడానికి అవకాశం  ఉండదు.  థియేటర్లలో జనాలు ఈ రేంజ్ లో  నవ్వి చాలా రోజులైందని చెప్పాలి. అందుకు              వీళ్ళ ముగ్గురి నటనే కారణం.

   అరణ్య  సినిమా కోసం రాణా పడిన కష్టం    ఇప్పటివరకూ ఎవరూ పడలేదు. ఈ సినిమా         షూటింగ్ టైమ్ లోనే అతడి హెల్త్    పాడయ్యింది. ట్రీట్మెంట్ తీసుకున్నాడు.            నటుడిగా తన బెస్ట్ ఇచ్చాడు.

 ధనుష్ కు నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన  పాత్రను వెంకటేష్ ఎలా చేయగలడు అని   తమిళ ఆడియన్స్ నవ్వారు. ఆ నవ్విన  వాళ్లందరికీ తన నటనతోనే సమాధానం  చెప్పి,  రెండు వేరియేషన్స్ ఉన్న నారప్ప    క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేశాడు.

“అంధాదున్”ను దాదాపుగా అన్నీ భాషల్లో  రీమేక్ చేసినప్పటికీ.. తెలుగు వెర్షన్ లో నితిన్ తరహాలో మిగతా భాషల నటులు ఆ పాత్రను          పండించలేకపోయారనే చెప్పాలి.

“అఖండ”. అఘోర పాత్రల్లో బాలయ్య నట    విశ్వరూపం. ఫైట్స్ & డ్యాన్స్ బాలయ్య  ఫ్యాన్స్ ను మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా     ఉన్న తెలుగు సినిమా అభిమానులను  విశేషంగా అలరించింది. హీరో ఆఫ్ ది ఇయర్  గా బాలయ్యను నామినేట్ చేసినా తప్పులేదు.

   పుష్ప”లో తన ఊరమాస్ యాంగిల్ ను        ఆడియన్స్ ను పరిచయం చేసాడు.    ఒక మాస్ క్యారెక్టర్ ను ఇంతకంటే మాసీగా        మరెవరూ చేయలేరు అనే స్థాయిలో                         చేసాడు బన్నీ

నాని వేరియేషన్స్ చూపించడం లేదు అని  విశ్లేషణలు వచ్చాయి. వాటిని కాస్త సీరియస్  గా తీసుకున్న నాని “శ్యామ్ సింగరాయ్”తో                    సమాధానం ఇచ్చాడు.