టాలీవుడ్ లో ఆన్-స్క్రీన్ లవ్లీ పెయిర్ గా పాపులర్ అయ్యారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన.
వీరిద్దరూ కలిసి తెలుగులో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలలో విజయ్ – రష్మికల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడంతో..
తాజాగా ఈ లవ్లీ పెయిర్ ముంబై నగర వీధుల్లో దర్శనమిచ్చారు. ఇద్దరికీ ప్రస్తుతం షూటింగ్స్ పరంగా బ్రేక్ లభించడంతో..
చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలిసి బాంద్రాలోని ఓ రెస్టారెంట్ లో డిన్నర్ కి వెళ్లినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం వీరిద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఓవైపు పుష్ప సినిమాతో ఇటీవలే పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించింది రష్మిక.
మరోవైపు లైగర్ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు విజయ్ దేవరకొండ.
విజయ్ – రష్మిక మరోసారి జంటగా కనిపించే సరికి వీళ్ళ కామ్రేడ్స్ అందరూ మరో సినిమా చేస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
అదీగాక వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కాకుండా ఇంకేదో అంతకు మించింది.. ఉందేమోనని నెట్టింట సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కానీ అందరూ ఊహించినట్లుగానే విజయ్ – రష్మిక.. మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొస్తున్నారు.
మరి ఈ లవ్లీ పెయిర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.