‘ బిగ్ బాస్ 5 తెలుగు’ విన్నర్ అవుతాడనుకున్న షణ్ముఖ్ రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు.
అంత ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ జశ్వంత్ ఎందుకు విన్నర్ కాలేకపోయాడు? షణ్ముఖ్ ఓటమికి కారణాలు తెలుసుకుందాం.
‘షణ్ముఖ్ జశ్వంత్’ ఈ పేరు నెటిజన్స్ కు సుపరిచితం. కేవలం యూట్యూబ్ తో ఒక స్టార్ గా ఎదిగాడు షణ్ముఖ్.
బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది షణ్ముఖ్ ఒక్కడే. తన యూట్యూబ్ ఛానల్ కు 44 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే మాటలు కాదు.
బిగ్ బాస్ సీజన్ లో షణ్ముఖ్ ను బ్యాడ్ చేసిన అంశాల్లో ప్రధానమైంది సిరితో రిలేషన్ అనేది సోషల్ మీడియా టాక్.
సిరికి- షణ్ముఖ్ కి బయట వేరే వారితో రిలేషన్ ఉండటమే ప్రేక్షకుల్లో అంత బ్యాడ్ కావడానికి కారణం.
హగ్గులవిషయం కూడా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెట్టింది. సిరి తల్లి వచ్చి హగ్గులు నచ్చడం లేదు అన్న తర్వాత మరీ నెగెటివ్ అయిపోయాడు షణ్ముఖ్.
హౌస్ మేట్స్, ఆడియన్స్ ను జడ్జ్ చేయడం కూడా షణ్ముఖ్ కు నెగెటివ్ అయ్యింది.ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం కూడా షణ్ముఖ్ ఓటమికి కారణం.
ఇంట్లో 18 మంది సభ్యులు ఉంటే షణ్ను క్లోజ్ అయ్యింది కేవలం ఇద్దరికి మాత్రమే.జెస్సీ, సిరితో మాత్రమే షణ్ముఖ్ ఫ్రెండ్లీగా ఉన్నాడు. అది కూడా షణ్ముఖ్ కు నెగెటివ్ అయ్యింది.
44 లక్షల ఫాలోవర్స్ ఉన్న షణ్ముఖ్ టైటిల్ విన్నర్ కాలేదు అంటే.. అతని అభిమానులు సైతం ఓట్లు వేయలేదనే కంక్లూజన్ కు వచ్చేస్తున్నారు.