అల్లు అర్జున్-సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్లో  తెరకెక్కిన ‘పుష్ప' అంచనాలను  ఏమేర  అందుకుందో ఈ రివ్యూ ద్వారా  తెలుసుకుందాం.

 పుష్పరాజ్ అలియాస్ పుష్ప (అల్లు అర్జున్)  చిత్తూరు జిల్లాలో ఒక పేద కుటుంబానికి  చెందిన కుర్రాడు. తనకంటూ ఒక ఇంటి   పేరు లేక.. ఆదరువు లేక అతను అవమానాల  పాలవుతుంటాడు.

డబ్బు సంపాదిస్తేనే సమాజంలో తనకొక  గుర్తింపు వస్తుందని అందుకోసం ఏ పని  చేయడానికైనా సిద్ధపడిన పుష్ప  ఎర్రచందనం చెట్లు నరికే కూలీగా  మారతాడు. 

అక్కడి  స్మగ్లర్ అవ్వడం, తరువాత  ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నే  చేజిక్కించుకోవడానికి ప్రణాళిక వేయడం  జరుగుతుంది.

 పుష్ప ఒక్కో మెట్టు ఎక్కేకొద్దీ అతడికి  శత్రువులు కూడా పెరుగుతారు. వారిని దాటి  పుష్ప తాను అనుకున్న లక్ష్యాన్ని ఏమేరకు  చేరుకున్నాడు అన్నది మిగతా కథ.

'పుష్ప' కథలో కేజిఎఫ్, రంగస్థలం ఫ్లేవర్స్  ఎక్కువగా కనిపిస్తాయి. కానీ.., పుష్ప  మాత్రం ఆ సినిమాల స్థాయిలో లేదు.

ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో ఎప్పుడూ  చూడని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో  కథని నడపడం మాత్రం పుష్పకి ప్లస్  అయింది. 

పుష్ప కూలీగా మొదలుపెట్టి సొంతంగా  ఎర్రచందనం స్మగ్లర్ గా ఎదిగే క్రమాన్ని  చాలా ఎగ్జైటింగ్ గా.. మాస్ మెచ్చేలా  తీర్చిదిద్దాడు సుకుమార్.

ఫస్ట్ ఆఫ్ లో ఉన్న టెంపోను కనుక  ద్వితీయార్ధంలో కొనసాగించి ఉంటే ‘పుష్ఫ’  రేంజే వేరుగా ఉండేది. కానీ సెకండాఫ్ లో   ప్రత్యేకంగా అనిపించే విషయాలేమీ లేవు.

ప్రిక్లైమాక్స్ దగ్గర బాగా డౌన్ అయ్యే ‘పుష్ప ’ చివర్లో ఫాహద్ ఫాజిల్ రంగప్రవేశంతో కానీ.  మళ్లీ పుంజుకోదు. కానీ.., అప్పటికే  జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

ఫాహద్ స్థాయికి తగ్గట్లుగా తన పాత్రను  ఆసక్తికరంగా మొదలుపెట్టి.. హీరోతో మంచి  కన్ఫ్రంటేషన్ సీన్ పెట్టి సినిమాకు మంచి  ముగింపునిచ్చాడు సుకుమార్.

 ‘పుష్ప: ది రూల్’కు లీడ్ గా చేసిన పతాక  సన్నివేశాలు సుకుమార్ మార్కును  చూపిస్తాయి. కానీ అంతకుముందు మాత్రం  ‘పుష్ప’ జోరు బాగా పడిపోయింది. 

‘పుష్ప’లో అల్లు అర్జున్ ది వన్ మ్యాన్ షో.  కెరీర్లో ది బెస్ట్ అనదగ్గ పెర్ఫామెన్స్  ఇచ్చాడతను. హీరోయిన్ రష్మిక మందన్న  బాగానే కష్టపడ్డట్లు అనిపించినా.. తన పాత్ర  అనుకున్నంతగా ఎలివేట్ కాలేదు.

ఓవరాల్ గా ‘పుష్ప’ అనుకున్నంత స్థాయిలో  లేదు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఓకే  అనిపించినా.. బ్యాగ్రౌండ్ స్కోర్  విషయంలో కొంత నిరాశ పరిచాడు.

సుక్కు మార్క్ మిస్ అయిన పుష్ప ది రైజ్  ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.