వాట్సాప్ సరికొత్త అప్డేట్స్ అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది.

టెక్నాలజీతో నేటి జీవన విధానాలకు అనుగుణంగా వాట్సాప్ కొత్త ఫీచర్స్

ఈ కొత్త ఫీచర్ ద్వారా.. వాయిస్ మెసేజెస్ ప్రివ్యూ చూసుకునే అవకాశం

వాట్సాప్ కాంటాక్ట్ కి వాయిస్ మెసేజ్ పెట్టేముందు ప్రివ్యూ చూడవచ్చు 

మనం పంపే వాయిస్ మెసేజ్ లో ఆడియో సరిగ్గా లేదనుకుంటే.. వెంటనే డిలీట్ చేయవచ్చు.

ఈ వాయిస్ మెసేజ్ ప్రివ్యూ ఫీచర్.. వ్యక్తిగత, గ్రూప్ చాట్లలో కూడా పనిచేస్తుంది.

ఈ ఫీచర్ Android, iOS లతో పాటు వెబ్, డెస్క్ టాప్ లలో కూడా వాడుకోవచ్చు.

మరి ఈ వాయిస్ మెసేజ్ ప్రివ్యూ ఫీచర్ యాక్టీవేట్ చేయడం ఎలా? అంటే..

వాట్సాప్ చాట్ లోని మైక్రోఫోన్(వాయిస్ రికార్డింగ్) బటన్ పై క్లిక్ చేసి, 

పైన కనిపించే హ్యాండ్స్-ఫ్రీ రికార్డింగ్ లాక్ వైపు స్లైడ్ చేయాలి. తర్వాత మీకు స్టాప్ బటన్, డిలీట్ బటన్ కనిపిస్తాయి.

స్టాప్ బటన్ను నొక్కి, ఆపై మీ వాయిస్ మెసేజ్ను షేర్ చేయడానికి ముందు ప్లే చేసి వినవచ్చు.

రికార్డు చేసిన మెసేజ్ సరిగ్గా లేదనుకుంటే డిలీట్ చేసి.. కొత్తగా రికార్డు చేసుకొని మెసేజ్ పంపించుకోవచ్చు.

ఈ ఫీచర్ మీ వాయిస్ మెసేజ్ లను డ్రాఫ్ట్ లో సేవ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది.

టెక్స్ట్ వెర్షన్ లో వాయిస్ మెసేజ్ పంపాలనుకుంటే.. ఈ కొత్త ప్రివ్యూ ఫీచర్ చాలా ఉపయోగకరం.