సోషల్ మీడియాలో సరికొత్త ల్యాండ్ ఫోన్ వైరల్ అవుతోంది.

ఈ స్మార్ట్ ల్యాండ్ లైన్ ఫోన్ పేరు KT5(3C).

వాస్తవానికి ఇది టాబ్లెట్ లాంటిదే. కానీ ల్యాండ్ ఫోన్ లుక్కులో దీని రిసివర్ అమర్చారు. 

ఇది ఎల్ఈడీ డిస్ప్లే కలిగి.. అన్ని రకాల యాప్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. 

ఈ ల్యాండ్ ఫోన్ లో వీడియోస్ తో పాటు అదిరిపోయే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. 

దీనికి సంబంధించి ఫోటోలను నికీ టోంస్కీ.. అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా షేర్ చేసాడు.

ఈ స్మార్ట్ ల్యాండ్ లైన్ ఫోన్.. KT5(3C) టాబ్లెట్ ఆండ్రాయిడ్ 10.0 ఆపరేటింగ్ సిస్టమ్, ఎల్టీఈ నెట్వర్క్తో పనిచేస్తుంది.

స్మార్ట్ ఫోన్లాగే ఇందులో సిమ్ కార్డు వేసుకోవాలి. వాట్సప్, యూట్యూబ్తో పాటు అన్నీ యాప్స్ వాడుకోవచ్చు.

ఈ స్మార్ట్ ల్యాండ్ ఫోన్లో 2500 ఎంఏహెచ్ రీచార్జబుట్, రిమువబుల్ బ్యాటరీ ఉంటుంది. 

స్టాండ్బై మోడ్లో 140 గంటల వరకు చార్జింగ్ ఆపుతుంది. ఒకవేళ బ్యాటరీ డెడ్ అయినప్పటికీ.. పవర్ సప్లైకి కనెన్ట్ చేసి మాట్లాడవచ్చు. 

మొదట్లో ఈ ల్యాండ్ ఫోన్ ఫేక్ అనుకున్నారు. కానీ టాబ్లెట్ మోడల్ ల్యాండ్ ఫోన్స్.. చైనా ఈకామర్స్ అలీ బాబాలో అందుబాటులో ఉన్నాయి. 

దీని ధర ప్రస్తుతం 115 – 140 డాలర్స్(అంటే రూ.8500 – 10,500/-) అని పేర్కొన్నాడు నికీ టోంస్కీ. 

ప్రస్తుతం ఈ స్మార్ట్ ల్యాండ్ ఫోన్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. 

త్వరలోనే ఇండియాలో లాంచ్ అవుతుందేమో చూడాలి.