ఇప్పటికే ఓపెనింగ్, బౌలింగ్ స్థానాలపై విశ్లేషణ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన SRH.. ఇప్పుడు మిడిల్ ఆర్డర్ పై దృష్టి సారించింది.
మిడిల్ ఆర్డర్ సమస్య ఆ జట్టును ఎప్పటి నుంచో వేధిస్తునే ఉంది. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు తీవ్ర ప్రయత్నలు చేస్తుంది SRH మేనేజ్మెంట్.
ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహ్యాబిటేషన్ కోసం వెళ్లిన హార్ధిక్ పాండ్యా.. ఐపీఎల్ ప్రారంభం వరకు ఫిట్నెస్ ను సాధిస్తే బౌలింగ్ చేసే అవకాశం ఉంది.
మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్తో పాటు హార్డ్ హిట్టింగ్ చేయగల పాండ్యా జట్టుకు అవసరమైన ప్రతిసారి బలంగా మారగలడు.
అందుకు ఎలాగైనా ఈ స్టార్ ఆల్ రౌండర్ ను తమ జట్టులోకి తేవాలని SRH ఓనర్ కావ్య భావిస్తున్నట్లు సమాచారం.
కాగా హార్ధిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోలేదనే విషయం తెలిసిందే. దీంతో హార్ధిక్ పాండ్యా మెగా వేలంలో అందుబాటులో ఉండనున్నాడు.
అలాగే టీ20 వరల్డ్ కప్ లో కూడా మంచి ప్రదర్శన కనబర్చలేదు. దీంతో అతన్ని న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఎంపిక చేయలేదు సెలెక్టర్లు.
దీంతో పాండ్యా ఫిట్నెస్ మెరుగుపర్చుకునేందుకు ఎన్సీఏలో కసరత్తు చేస్తున్నాడు.
మరి హార్దిక్ పాండ్యా సన్ రైజర్స్ లోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి