ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారన్న వార్తతో యావత్ సినీ లోకం దిగ్బ్రాంతిలోకి వెళ్ళిపోయింది.

నిజానికి సిరివెన్నెల ముందుగా  హాస్పిటల్ లో జాయిన్ అయ్యాక.. ఆయనకి పెద్ద ప్రమాదం ఏమి లేదని వైద్యులు, కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.

కానీ.., రెండు రోజుల వ్యవధిలోనే సిరివెన్నెల కన్నుమూయడం అందరిని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.

అసలు ఇంతకీ సిరివెన్నెల మరణానికి అసలు కారణాలు ఏవో తెలుసుకుందాం.

 సిరివెన్నెల చనిపోయిన తరువాత.. ఆయన  మరణంపై కిమ్స్ ఆస్పత్రి వైద్యులు కీలక ప్రకటన చేశారు.

అసిరివెన్నెల  చనిపోయింది కేవలం న్యుమోనియాతో కాదు.

క్యాన్సర్ సంబంధిత  సమస్యలు కూడా సీతారామశాస్త్రి మరణానికి కారణం అయ్యాయి. 

నిజానికి ఆరేళ్ల క్రితమే  సిరివెన్నెల క్యాన్సర్ కి గురయ్యారు. ఆ సమయంలోనే ఆయనకు సగం సగం లంగ్ తీసేశారు.

ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత కాంప్లికేషన్స్ వచ్చాయి. ఐదురోజులుగా ఎక్మోపై ట్రీమెంట్ అందించారు. 

 కానీ.., చివరగా శరీరం మొత్తం ఇన్ ఫెక్షన్ సోకడంతో సిరివెన్నెల కన్నుమూశారు. 

ఈ విషయాలను కిమ్స్ డాక్టర్ భాస్కరరావు బయట పెట్టారు.

ఈ విషయాలను కిమ్స్ డాక్టర్ భాస్కరరావు బయట పెతన శరీరంలో ఇంతటి కష్టాన్ని ఉంచుకుని కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎప్పుడూ పైకి మామూలుగానే కనిపిస్తూ వచ్చారు.

తన చివరి శ్వాస వరకు పాటనే ప్రాణంగా భావించిన సీతారామశాస్త్రి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.