ప్రముఖ పాటల రచయితగా పేరు గాంచిన సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన
సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు.
1986లో సిరివెన్నెల సినిమాలో ఆయన ప్రస్థానంలో అనేక తెలుగు పాటలు రచించారు.
ముఖ్యంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలకు గాను 11 నంది అవార్డులు రావడం విశేషం.
1986లో సిరివెన్నెల సినిమాలో ఆయన రాసిన విధాత తలపున అనే పాటకు మొట్టమొదటిసారిగా నంది అవార్డును దక్కించుకున్నాడు.
1987 లో వచ్చిన శ్రుతిలయలు సినిమాలోని తెలవారదేమో స్వామి అనే పాటకు సైతం నంది అవార్డు వరించడం విశేషం. దక్కించుకున్నాడు.
దీంతో పాటు 1993లో వచ్చిన గాయం సినిమాలోని సురాజ్యమవ్వాలని స్వరాజ్యమెందుకుని అనే పాటకు కూడా అవార్డు లభించింది.
1994లో వచ్చిన శుభలగ్నం సినిమలోని చిలక లే తోడు లేక అనే పాటకు కూడా కూడా ఆయనకు నంది అవార్డు వరించింది.
1996లో వచ్చిన శ్రీకారం మూవీ నుంచి మనసు కాస్త కలతపడితే అనే పాటకు సైతం నంది అవార్డు దక్కింది.
ప్రేమకథ-1999లో వచ్చిన దేవుడు కరుణిస్తాడని అనే పాటకు కూడా నంది అవార్డు లభించింది.
2005లో వచ్చిన చక్రం సినిమాలోని జగమంత కుటుంబం నాది అనే పాటకు కూడా ఆయనకు నంది అవార్డు వరించింది.
2008లో వచ్చిన గమ్యం మూవీలోని ఎంత వరకు ఎందు కొరకు అనే పాటకు కూడా ఆయనకు నంది అవార్డు వరించింది.
చివరి సారిగా 2013లో వచ్చిన సీతామ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలోని మరి అంతగా అనే సాగే పాటకు కూడా నంది అవార్డ వరించింది.
ఇలా సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ ప్రస్థానంలో ఉత్తమ పాటల రచయితగా ఏకంగా 11 నంది అవార్డులు రావడం విశేషం.