బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలుకాగా.. ఇప్పుడు హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు.

ఇక మానస్ తప్ప మిగిలిన వారంతా కూడా నామినేషన్ లో ఉన్నారు.

షణ్ముఖ్, సన్నీ, రవి, కాజల్ ఇలా అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనే చెప్పాలి.

ఈసారి ఇంటి నుంచి బయటకు వెళ్లేది ప్రియాంక అని గత వారం నుంచి టాక్ వినిపిస్తుంది. కానీ ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.

ప్రియాంక ఎలిమినేట్ అని అందరూ అనుకున్నారు.. కానీ, యాంకర్ రవి హౌస్ నుంచి బయటకు వచ్చాడు.

హౌస్ లో ఉన్నవాళ్లలో ఇద్దరు, ముగ్గురు కంటే రవినే స్ట్రాంగ్ కంటెస్టెంట్.

రవి ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో పలు సందేహాలు, ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవి ఎలిమినేషన్ లో కుట్ర జరిగింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే ఇంట్లో ఉన్న ట్రాకుల కోసం ఇలాంటి నిర్ణయం బిగ్ బాస్ తీసుకున్నాడా అన్న అనుమానాలు వస్తున్నాయి.

ప్రియాంక్ సింగ్ ను ఎలిమినేట్ చేయకుండా.. మానస్- ప్రియాంక్ సింగ్ ట్రాక్ కొనసాగించాలని భావించినట్లు తెవలుస్తోంది.

కాజల్, సిరి, ప్రియాంక సింగ్ ల కంటే యాంకర్ రవి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనడంలో ఎలాంటి సదేహం లేదు.

మరి ప్రియాంక సింగ్, కాజల్, సిరిలో ఒకరు కాకుండా యాంకర్ రవి ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అని సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు సంధిస్తున్నారు అభిమానులు.

యాంకర్ రవి ఫాలోవర్స్ అయితే రవి ఎలిమినేషన్ లో కుట్ర జరిగింది అనే గట్టిగా వాధిస్తున్నారు.