ఆకాశం వైపు వెళ్తున్న టమాట ధర ఒక్కసారిగా కుప్పకూలింది. వారం రోజులు రూ.100పైనే ధర పలికిన టమాట..

ఇప్పుడు 5, 10 రూపాయలు కాదు ఏకంగా 70 రూపాయలు తగ్గింది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో నిన్నటి వరకు కూడ రూ.100 పలికిన టమాట ఇవ్వాళ రూ. 30 పలికింది.

 ఒక్కసారిగా టమాట ధర ఇంతలా పతనం కావడంతో రైతులు షాకయ్యారు.

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర , తెలంగాణ రాష్ట్రాల నుంచి టమాలు దిగుమతి కావటంతోనే ధర పడిపోయినట్లు భావిస్తున్నారు.

ఏది ఏమైనా వారంరోజులుగా అందరికి చుక్కలు చూపిస్తున్న టమాట ఒక్కసారి ధర ఇంతలా పడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

తుఫాన్ ప్రభావంతో రాయలసీమ, తమిళనాడు ప్రాంతాలకు టమాట సరఫరా ఆశించిన స్థాయిలో జరగలేదు.

చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ లో గత కొంతకాలం టమాట దిగుమతి లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగాయి.

ఒకానొక దశలో టమాట ధర రూ.150 కి చేరింది. వస్తువులు కొంటే గ్రాము బంగారం ఉచితంగా ఇస్తాం అన్నట్లుూ..

టమాటకు కూడా ఉచిత ఆఫర్ లో ప్రకటించారంటే డిమాండ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే ప్రస్తుతం వర్షాలు తగ్గడం, మార్కెట్లకు సరఫరా చేసేందుకు రవాణకు అంతరాయం తొలగిపోయింది.

దీంతో పక్క రాష్ట్రాల నుంచి టమాట అధిక మొత్తంలో దిగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. 

టమాట ధరలు ఇంతలా పతనం అవటం సామాన్యులకు సంతోషాన్ని కలిగిస్తోంది. 

మరి.. టమాట ధర ఈ స్థాయిలో తగ్గటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.