ఈ చిత్రంలో వెంకటేష్ చిన్న కూతురు గా నటించిన ఎస్తేర్ అనిల్ కి సంబంధించిన ఫోటో షూట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
దృశ్యం సినిమాలో ముద్దు ముద్దు మాటలతో చిన్నారిగా కనిపించిన ఈ పిల్ల.. అప్పుడే ఎంత పెద్దది అయిపోయిందో అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
అప్పుడు ఆమె వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం ఈమె వయస్సు 20 ఏళ్లు. దీనికి తగ్గట్టుగానే ఫోటోషూట్లో అందాలు బాగా ఆరబోసింది.
ఇక ఎస్తర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నెట్టింట ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. నిత్యం తన ఫొటోలతో అభిమానులను పలకరిస్తుంది.
ఇక ఏమాత్రం మొహమాటపడకుండా బోల్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. ఎస్తేర్ ఇప్పటికే మలయాళంలో హీరోయిన్ గా బిజీ అవుతోంది. తెలుగులో కూడా ఈమెకు అవకాశాలు వస్తున్నాయి.
ఇక్కడ కుర్ర హీరోలకు ఎస్తేర్ అనిల్ సరైన జోడీగా కనిపిస్తుంది. కేవలం ఏడు సంవత్సరాల వ్యవధిలో ఎస్తేర్ అనిల్ మారిపోయిన విధానం చూసి అందరు షాక్ అవుతున్నారు.