టమాట.. ఒక్కోసారి ధర లేక, మార్కెట్లో అమ్ముడు పోక రైతులు రోడ్లపై పారబోస్తుంటారు.

 కానీ ఒక్కోసారి మాత్రం టమాట ధర ఆకాశాన్నంటుతుంది. ఇదిగో ఇప్పుడు టమాట ధర అమాంతం పెరిగింది. 

 ఏకంగా 100 రూపాయలు దాటి 150 రూపాలకు చేరువగా ఉంది. 

ఆంధ్రప్రదేశ్ లో మొన్న కురిసిన  భారీ వర్షాలు, వరదలకు చాలా ప్రాంతాల్లో పంట నాశనం అయ్యింది. దీంతో టమాట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. 

 పొలంలో పంట ఉన్నా కోయలేని పరిస్థితులు నెలకొన్నాయి. వర్షపు నీటితో ఇబ్బందులు రావడంతో మార్కెట్ లోకి పంట రావడం ఆగోపోయింది.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంవత్సరం లక్షా 43 వేల ఎకరాల్లో 2.27 లక్షల టన్నుల టమాటా సాగవుతుంది.

వర్షాలు, వరదల కారణంగా పంట తీవ్రంగా దెబ్బతినడం, రవాణా చేయడానికి వీలు లేకపోవడంతో టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.

ఇటువంటి సమయంలో కొందరు రైతులకు మాత్రం టమోటా కాసుల వర్షం కురిపిస్తోంది.

 కర్నూలు జిల్లాలో  ఓ టమోటా రైతు కోటీశ్వరుడైపోయాడు.

ఈ సీజన్లో ఈ రైతుకు ఏకంగా కోటి రూపాయల మేర దిగుబడి వచ్చిందట.

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తి  గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ, సైబా, ఉషాలాం లది ఉమ్మడి కుటుంబం.

తమకు ఉన్న 100 ఎకరాల పొలంలో 40 ఎకరాల్లో వారు టమాటా పంట సాగు చేశారు. 

 ప్రస్తుతం కిలో టమాట 130 దాటిన నేపథ్యంలో వారికి మంచి లాభం వచ్చింది. 

టమాట అమ్మకం ద్వార ఇప్పటివరకు వీరికి  80 లక్షల రూపాయిలకుపైగా రాబడి వచ్చిందట.

రాబోయే రోజుల్లో మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.