ఓ సినిమాకి ఆరేళ్ళ తర్వాత సీక్వెల్ తీయడం అంటే సాహసమనే చెప్పాలి. నిజానికి సీక్వెల్స్ సక్సెస్ అయిన సందర్భాలుతక్కువ.
ఆ భయాలను, సెంటిమెంట్ ని పక్కన పెట్టి.. దృశ్యం మూవీకి సీక్వెల్ గా దృశ్యం-2 తెరకెక్కించారు మేకర్స్.
రాంబాబు కుటుంబం వరుణ్ హత్య కేసునుండి బయట పడటంతో దృశ్యం కథ ముగిసింది. సరిగ్గా అక్కడ నుండే దృశ్యం-2 కథ మొదలవుతుంది.
ఈ ఆరేళ్ళ కాలంలో రాంబాబు ఆర్ధికంగా నిలదొక్కుకుంటాడు. ఓ ధియేటర్ కి ఓనర్ అవుతాడు. తానే సొంతంగా ఓ సినిమా నిర్మించాలని సొంతగా కథ సిద్ధం చేస్తుంటాడు.
ఇలా.. పోలీసులు ఇక తనని పట్టుకోలేరని రాంబాబు నమ్మకంగా ఉంటాడు. కానీ.., అంతకు రెండేళ్ల ముందు నుండే పోలీసులు రాంబాబు కోసం సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు.
అనుకోకుండా రాంబాబు, అతను కుటుంబం పోలీసుల ట్రాప్ లో చిక్కుకుంటారు. దీంతో.., వీరికి మళ్ళీ కష్టాలు మొదలవుతాయి.
ఈసారి కూడా రాంబాబు తన సినిమా నాలెడ్జ్ తో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అన్నదే దృశ్యం 2 కథ.
ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఫస్ట్ హాఫ్ ని నడిపించి.. రెండో భాగానికి అద్భుతమైన సన్నివేశాలతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నారు దర్శకుడు జీతూ జోసెఫ్.
ముఖ్యంగా ఇందులో విక్టరీ వెంకటేశ్ నటనకి ఎవరైన హేట్సాఫ్ చెప్పాల్సిందే. వెంకీ కళ్ళతో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి.
మీనా, నదియా, సీనియర్ నరేష్, సంపత్ రాజ్, తనికెళ్ల భరణి తమ పరిధి మేరకు నటించారు. టెక్నీకల్ గా దృశ్యం 2 కి మంచి టీమ్ దొరికింది.