రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎట్టకేలకు వైసీపీ జెండా పాతేసి పీఠాన్ని సాధించుకుంది.

చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో మున్సిపాలిటీ ఎన్నిక ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సాగింది.

ఈ పోరులో మాత్రం టీడీపీ ఘోరంగా ఓటమి చవిచూడడంతో చంద్రబాబు షాక్ కు గురయ్యారు.

కుప్పంలో మొత్తం 25 వార్డులుకు గాను వైసీపీ ఎన్నికలకు ముందే 14 వార్డులను ఏకగ్రీవం చేసుకుంది.

అయితే మిగతా వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో మాత్రం 15 వార్డులకు గాను వైసీపీ ఏకంగా 13 వార్డులు గెలుచుకుని చంద్రబాబు కంచుకోటను బద్దలు కొట్టింది.

 టీడీపీ మాత్రం కేవలం 2 వార్డులను మాత్రమే కైవసం చేసుకుని ఘోరంగా ఓటమి పాలైంది.

 చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ ఓడిపోవటానికి గల ఐదు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా టీడీపీ స్థానిక నేతలు కుప్పం నియోజకవర్గానిక దూరంగా ఉండటం.

టీడీపీకి మొదటి నుంచి వెంటున్న బలం, బలగం, వర్గం ఈ మధ్యకాలంలో దూరమవ్వడం.

ఆపరేషన్ కుప్పం అన్న రీతిలో వైసీపీ పెద్ద నాయకుడు ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.

ప్రత్యర్థుల కుప్పం విషయంలో ప్రత్యర్థుల వేగాన్ని చంద్రబాబు అంచనా వేయలేకపోవడం.

ఒక్క చంద్రబాబు తప్పా మరో మాస్ లీడర్ పార్టీలో లేకపోవడం.

“”

పైన పేర్కొన్న ప్రధాన కారణాలే కుప్పంలో టీడీపీ ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

“”