మనదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సరికొత్త ఆలోచనలకు పదును పెడుతున్నారు.
ప్రభుత్వంలాంటి సర్వీసుల్లో ఉద్యోగం ఉన్నా, అగ్రరాజ్యం లాంటి అమెరికా దేశాల్లో సాఫ్ట్ వేర్ కొలువులున్నా యువత మాత్రం ఎక్కువగా సొంత బిజినెస్ పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
అచ్చం ఇలాగే బిజినెస్ స్టార్ చేసింది నైజీరియాలోని ఓ యవ మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్త ఇఫిడేలాపో రాన్‌సేవే.
ఆమె పేరు ఇఫిడేలాపో రాన్‌సేవే నైజీరియాలోని ఓ యవ మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా విజయం సాధించింది.
ఎవరు కూడా ఊహించని రీతిలో సరికొత్తగా ఓ బిజినెస్ స్టార్ట్ చేసింది ఇఫిడేలాపో రాన్‌సేవే.
రోడ్ల పక్కన, చెత్త కుప్పల్లో, డ్రైనేజీ కాలువల్లో పడి ఉన్న అరిగిపోయిన పాత టైర్లన్నీ తీసుకొచ్చి వాటిని కరిగిస్తారు.
వాటిని అధునాతన యాంత్రాల సాయంతో రీసైకిలింగ్ ప్లాంట్‌కి తీసుకువచ్చి ప్రత్యేక పద్దతిలో పేవ్మెంట్ బ్రిక్స్‌గా తయారు చేస్తున్నారు.
ఇలా తయారు చేసిన నాణ్యమైప బ్రిక్స్ ని రోడ్లు, పార్క్, పాఠశాలల్లోని ఆవరణల్లో రోడ్ల తయారీలో ఉపయోగిస్తున్నారు.
కొత్తగా తయారు చేసిన బ్రిక్స్ నాణ్యత కూడా అద్భుతంగా ఉండటంతో అక్కడి ప్రజలు వీటిని ఉపయోగించటానికి ఆసక్తి చూపిస్తున్నారట.
ఈ దెబ్బతో పారిశ్రామిక వేత్త ఇఫిడేలాపో రాన్‌సేవే స్టార్ట్ చేసిన కంపెనీకి జోరుగా ఆర్డర్లు వస్తున్నాయట.
రెండేళ కిందట కేవలం ఇద్దరు వ్యక్తులతో మొదలైన ఈ కంపెనీలో ఇప్పుడు ఏకంగా 128 మంది ఉద్యోగులకు చేరుకున్నారట.
ఇప్పుడు నైజీరియాలోని ఎక్కడ పాత టైర్లు కనపడినా ఇఫిడేలాపో రాన్‌సేవే కంపెనీకి చేరుకుంటున్నాయట.
ఇప్పుడు నైజీరియాలో ఇదే పాత టైర్లను అంతా బ్లాక్ గోల్డ్ గా పిలుస్తున్నారని కంపెనీ అధినేత ఇఫిడేలాపో రాన్‌సేవే తెలిపింది.
ఇక ఆమె స్థాపించిన ఈ కంపెనీ లాభాల్లో దూసుకెళ్తుండటంతో యువ పారిశ్రామిక వేత్తల దృష్టి ఇఫిడేలాపో రాన్‌సేవే పై పడింది.
ఇక ఒక్కో టైరుకు 0.20 డాలర్లు (సుమారు రూ.15) చెల్లిస్తున్నామని, బ్రిక్స్ కాకుండా మరిన్ని వస్తువులు కూడా తయారు చేస్తున్నామని కంపెనీ అధినేత ఇఫిడేలాపో రాన్‌సేవే తెలిపింది.