ఎన్టీఆర్ హోస్ట్ గా  ప్రసారం అవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ గేమ్ షోలో పాల్గొని, కోటి రూపాయాలు గెలవాలని చాలా మంది కలలు కంటుంటారు.

ఈ షోలో ఇప్పటి వరకు పాల్గొన్న చాలా మంది వేలు, లక్షల వద్దే ఆగిపోయి ఇంటి దారి పట్టారు.

కానీ తొలిసారిగా ఓ కంటెస్టెంట్ ఏకంగా కోటి రూపాయలను గెలుచుకున్నారు. 

 తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి ఈ మొత్తాన్ని గెలుచుకోవడం విశేషం. 

తెలుగులో కోటి రూపాయలు గెలుచుకున్న ఏకైక వ్యక్తిగా కొత్త చరిత్ర లిఖించారు. 

 కొత్తగూడెం పట్టణానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ బీ రాజారవీంద్ర ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో మొత్తం 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు.

దీంతో రాజారవీంద్ర కోటి రూపాయల ప్రైజ్మనీ గెలుచుకున్నారు. 

రాజారవీంద్రకు సంబంధించిన కొన్ని ఆసక్తి కర విషయాలు..

రాజారవీంద్ర పోలీస్ డిపార్టుమెంటులో పనిచేస్తూనే అనేక క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. 

 పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహించే క్రీడా పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకున్నారు. 

ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో దేశం తరపున ఒలింపిక్స్ పతకం గెలవాలన్నది తన కల అని ఈ ఆఫీసర్ తెలిపారు. 

ఎవరు మీలో కోట్వీరుడు గేమ్ షోలో గెలిచిన డబ్బును తన కల నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకుంటానని ఆయన చెప్పారు.

గత రెండు నెలలుగా ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షో కొనసాగుతోంది.

 కొంత మంది సెలెబ్రిటీలు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేశారు. ఐతే, ఎవరికీ సాధ్యం కాని చోట.. ఎస్సై రవీంద్ర అద్భుతం చేశారు.