ప్రారంభ ధర కింద ముందు బుక్ చేసుకునేవారికి రూ.17,999కే ఇవ్వనున్నట్లు తమ వెబ్ సైట్ లో లావా ఇంటర్నేషనల్ తెలిపింది.
గ్లోబల్ వైడ్ గా మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్ సెట్ తో 5జీ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన రెండో కంపెనీ లావా.
నవంబరు 18 నుంచి ప్రత్యక్ష మార్కెట్ తో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లోనూ లావా అగ్ని అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
అంతకన్నా ముందే బుక్ చేసుకోవాలంటే లావా ఈ-స్టోర్ లో ఆ అవకాశం కల్పించారు. నవంబరు 9 నుంచి 17 వరకు ప్రీ బుకింగ్స్ కు అవకాశం కల్పించింది.
లావా అగ్ని 6.78 అంగుళాల ఫుల్ హై డెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ పంచ్ హోల్ డిస్ ప్లేతో అందుబాటులోకి వస్తోంది.
లావా అగ్ని 6.78 అంగుళాల ఫుల్ హై డెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ పంచ్ హోల్ డిస్ ప్లేతో అందుబాటులోకి వస్తోంది.
కెమెరా విషయానికి వస్తే 64 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ వైడ్ యాంగిల్, 2 ఎంపీ డెప్త్, 2 ఎంపీ మాక్రో కెమెరాలు ఉన్నాయి.16 మెగాపిక్సెల్ తో ఫ్రంట్ కెమెరా వస్తుంది.