గత రెండేళ్లుగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ సమయంలో సినిమా కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

అయితే హీరో సూర్య మాత్రం తన సినిమాలు ఓటీటీ లో రిలీజ్ చేస్తూ వచ్చారు. అయితే దీనిపై ఆయన కొంత డిస్ట్రిబ్యూటర్ల నుంచి వ్యతిరేకత కూడా ఎదుర్కొన్నారు.

తాజాగా సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం రికార్డు సృష్టించింది. అమెజాన్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది.

టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన‘జై భీమ్’ దళిత వర్గానికి చెందిన ఓ కుటుంబంపై పోలీసులు అన్యాయంగా చేసిన దాడిని తెరపై ఆలోజింపజేసేలా చిత్రీకరించారు. 

 తాజాగా ఈ చిత్రం ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ సినిమాల జాబితాలో టాప్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

దాదాపు 97శాతం మంది గూగుల్ యూజర్లు ఈ చిత్రం బాగుందంటూ కొనియాడారు.

నిన్న మొన్నటి వరకూ తొలిస్థానంలో 1994లో విడుదలైన ‘‘ది షాషాంక్ రిడంప్షన్’’ ఉండగా.. దాన్ని రెండో స్థానానికి నెట్టి ‘జై భీమ్’ తొలి స్థానాన్ని దక్కించుకుంది.

గతేడాది ఓటీటీలో విడుదలైన సూర్య చిత్రం ‘ఆకాశం.. నీ హద్దురా’ సైతం ఐఎమ్డీబీ టాప్-10 జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. 

అయితే ‘జై భీమ్’చిత్రంతో నటుడు సూర్య కూడా మంచి లాభాల బాట పట్టినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా కోసం పెట్టుబడి రూ. 10 కోట్లు అయినట్లు సమాచారం. 

అయితే ‘జై భీమ్’ చిత్రాన్ని అమెజాన్ రూ.45 కోట్లకు అమ్మినట్లు ఇండస్ట్రీలో టాక్ నడిచింది.

ఈ లెక్కన 35 కోట్ల లాభంతో ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం.

అయితే సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం దేశ వ్యాప్తంగా ఎంతమంది హృదయాలు దోచింది. 

సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ చిత్రం పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.