విమర్శలు, అవమానాలతో సమాజ సేవలో
ఎంతో స్థాయికి ఎదిగి నేడు పద్మ శ్రీ పురస్కారాన్ని
అందుకున్నాడు హరేకల హజబ్బ.
తన సేవ గుణంతో ఎంతో మంది పిల్లలకు
చదువును అందిస్తూ.. తోటి వారి కష్టాన్ని చూసి
స్పందించే వ్యక్తి హజబ్బ. ఇక ఈయన సేవలను
కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయనను పద్మ శ్రీ
అవార్డుతో సత్కరించింది.
నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల
మీదుగా హజబ్బ ఈ పురస్కారాన్ని
అందుకున్నాడు.
అసలు ఎవరీ హజబ్బ? అతను చేసిన సేవలు
ఏంటంటూ నెట్టింట్లో వెతికే పనిలో పడ్డారు.
ఆయన పేరు హరేకల హజబ్బ.. కర్ణాటక
రాష్ట్రంలో మంగళూరు ప్రాంతానికి చెందిన వాడు.
కమలాలు అమ్ముకుంటూ జీవనాన్ని
కొనసాగిస్తున్నాడు.
హజబ్బ పళ్లు అమ్ముతున్న క్రమంలో ఇంగ్లీష్
రాకపోవటంతో ఓ ఫారన్ దంపతుల నుంచి
అవమానాలు ఎదుర్కొన్నాడు.
అలా ఆ ఫారన్ దంపతులు ఎగతాళిని
అవమానంగా భావించిన హజబ్బ.అక్కడ జరిగిన
అవమానాన్ని భరించని హజబ్బ తన గ్రామంలోని
పిల్లలకు భవిష్యత్ లో ఇలాంటి అవమానాలు
రాకుడదని భావించాడు.
తను మనసులో అనుకున్నది బలంగా నమ్మిన
హజబ్బ 2001 జూన్ నాటికి ప్రభుత్వం, దాతల
సాయంతో 8 తరగతి గదులు, రెండు మరుగు
దొడ్లతో స్కూలు నిర్మాణం పూర్తి చేశాడు.
ఆ తర్వాత నుంచి హై స్కూల్ ను కూడా పూర్తి
చేసి ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ఇక
ఇంతటితో సంతృప్తి హజబ్బ భవిష్యత్ పిల్లల
కోసం మరిన్ని విద్యాసంస్థలు నిర్మించి గ్రామంలో
ఫ్రీ యూనివర్సిటీ కళాశాలను నిర్మించాలని
కలలు కంటున్నాడు.
హజబ్బ చేస్తున్న సమాజ సేవకు అతనిని
కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారంతో
సత్కరించాలని భావించి 2020 సంవత్సారినికి గాను
ఆయనను పద్మ శ్రీ అవార్డుకు ఎంపిక చేసింది.
ఇలా ఎన్నో సంస్థలు హజబ్బ అవార్డులతో
పాటు ఆర్థిక సాయంతో సత్కరించాయి. అలా
వచ్చిన డబ్బులను సేవలకు ఖర్చు చేస్తూ
ఇప్పటికీ సొంత ఇల్లు లేకుండా ఉన్నాడు
మన హరేకల హజబ్బ.
ఇలా సమాజ సేవ కోసం అహర్నిశలు కృషి
చేస్తున్న హజబ్బ సేవలను అందరూ కొనియాడుతూ
సలాం హజబ్బ అంటున్నారు.